News April 21, 2025
ఆ చైనా యాప్ తీసేయండి.. గూగుల్‌కు భారత్ సూచన

చైనాకు చెందిన వీడియో చాటింగ్ యాప్ ‘యాబ్లో’(Ablo)ను ప్లే స్టోర్ నుంచి తొలగించాలని గూగుల్‌కు భారత ప్రభుత్వం సూచించింది. అందులో భారత భూభాగాల్ని తప్పుగా చూపించడమే దీనికి కారణం. జమ్మూకశ్మీర్, లద్దాక్‌ను భారత భూభాగాలుగా చూపించని ఆ యాప్, లక్షద్వీప్‌ను మొత్తానికే మ్యాప్ నుంచి తొలగించింది. ఈ నేపథ్యంలోనే భారత సార్వభౌమత్వాన్ని గౌరవించని ఆ యాప్‌ను తొలగించాలని గూగుల్‌కు భారత్ తేల్చిచెప్పింది.
Similar News
News August 8, 2025
APPLY.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 417 పోస్టులు

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 417 మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఈ నెల 26వరకు అప్లై చేసేందుకు అవకాశం కల్పించింది. అనుభవం తప్పనిసరి. కనిష్ఠ వయోపరిమితి 24 ఏళ్లు, గరిష్ఠంగా 42 ఏళ్లుగా పేర్కొంది. జనరల్, ఓబీసీ, EWS అభ్యర్థులకు రూ.850, మహిళా అభ్యర్థులు, ఇతరులకు రూ.175 దరఖాస్తు ఫీజుగా ఉంది. ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలకు ఇక్కడ <
News August 8, 2025
చైనాపై టారిఫ్స్ పెంచాలంటే ట్రంప్ వణుకు.. కారణమిదేనా?

రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నా చైనాపై సుంకాలు పెంచేందుకు ట్రంప్ భయపడుతున్నారు. ప్రస్తుతం చైనా వస్తువులపై 30% టారిఫ్స్ విధిస్తున్నారు. USలోని ప్రముఖ ఆటోమొబైల్, టెక్ కంపెనీలకు చైనా అరుదైన ముడి సరుకులు సప్లై చేస్తోంది. టారిఫ్స్ పెంచితే ధరలు పెరుగుతాయి. అమెరికాను శాసించే బడా కంపెనీలు దీనికి సిద్ధంగా లేవు. ఒకవేళ ట్రంప్ ఆ పని చేస్తే వ్యాపారవేత్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది.
News August 8, 2025
వరుస అల్పపీడనాలు.. ముప్పు పొంచి ఉందా?

AP: ఈ నెలలో బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటంతో ఈ నెల 13 నాటికి అల్పపీడనం ఏర్పడి, పశ్చిమ దిశగా కదులుతుందని అంచనా వేశారు. దాని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆ తర్వాత వెంటవెంటనే అల్పపీడనాలు ఏర్పడతాయని, అవి తుపాన్లుగా బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు.