News April 24, 2024

ఒక్క సినిమాకే రూ.280కోట్ల రెమ్యునరేషన్?

image

సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఆయన లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ సినిమా చేస్తున్నారు. అయితే.. ఆ మూవీకి తలైవా ఏకంగా రూ.260 నుంచి రూ.280కోట్ల వరకూ ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఆసియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా రజనీకాంత్ నిలుస్తారు. ఇటీవల వచ్చిన కూలీ టీజర్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీ 2025లో విడుదలవనుంది.

Similar News

News November 9, 2025

SFIOలో 36 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్(<>SFIO<<>>)36 డిప్యూటీ డైరెక్టర్, సీనియర్ ప్రాసిక్యూటర్, సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్, తదితర పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 28 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, LLB, CA, MA, M.COM, MBA/PGDM ఉత్తీర్ణులు అర్హులు. వెబ్‌సైట్: https://sfio.gov.in

News November 9, 2025

BIGG BOSS: ఈ వారం డబుల్ ఎలిమినేషన్!

image

బిగ్‌బాస్ తెలుగు సీజన్-9లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగినట్లు తెలుస్తోంది. రాము రాథోడ్ నిన్న సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యారు. ఫ్యామిలీని మిస్ అవుతున్నానని చెప్పి హౌజ్ నుంచి నిష్క్రమించారు. మరోవైపు అతి తక్కువ ఓట్లు రావడంతో ‘గోల్కొండ హైస్కూల్’ మూవీ ఫేమ్ శ్రీనివాస సాయిని బయటికి పంపినట్లు సమాచారం. ప్రస్తుతం హౌజ్‌లో 11 మంది మిగిలారు. మరో 6 వారాల్లో షో ముగియనుండగా టాప్-5కి వెళ్లేదెవరనే ఆసక్తి నెలకొంది.

News November 9, 2025

RITES 40పోస్టులకు నోటిఫికేషన్

image

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్(<>RITES<<>>)40 మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. BE, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. గరిష్ఠ వయోపరిమితి 40ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.600, SC, ST, PWBDలు రూ.300 చెల్లించాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://rites.com/