News April 11, 2024
‘రామాయణం’ కోసం రూ.75 కోట్ల రెమ్యునరేషన్!

నితేశ్ తివారీ తెరకెక్కించనున్న ‘రామాయణం’ సినిమాలో రాముడి పాత్ర కోసం రణ్‌బీర్ కపూర్ రూ.75 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. అయితే, సీత పాత్రలో నటించనున్న హీరోయిన్ సాయి పల్లవి రూ.6 కోట్లు తీసుకోనుండగా రాకింగ్ స్టార్ యశ్ ఏకంగా రూ.80 కోట్ల పారితోషికం తీసుకోనున్నట్లు సమాచారం. తాజాగా, రాముడి పాత్ర కోసం రణ్‌బీర్ శిక్షణ తీసుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది.
Similar News
News October 22, 2025
బీఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్

సీనియర్ సిటిజన్(60 ఏళ్లు పైబడిన) నూతన యూజర్ల కోసం BSNL కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. రూ.1,812తో రీఛార్జ్ చేసుకుంటే ఏడాది పాటు రోజూ 2GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, 100 SMSలు అందించనుంది. దీంతోపాటు BiTV సబ్స్క్రిప్షన్ 6 నెలల పాటు ఉచితంగా అందించనుంది. వచ్చే నెల 18 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. అటు కొత్త యూజర్లకు రూ.1కే <<18014372>>రీఛార్జ్<<>> ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
News October 22, 2025
అక్టోబర్ 22: చరిత్రలో ఈరోజు

1901: ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీం జయంతి
1998: బాలీవుడ్ నటుడు అజిత్ ఖాన్ మరణం
2001: సినీ నటుడు రామకృష్ణ మరణం
2008: చంద్రుడి పైకి మానవరహిత చంద్రయాన్-1ను ప్రయోగించిన ఇస్రో
➣అంతర్జాతీయ నత్తి నివారణ అవగాహన దినోత్సవం
News October 22, 2025
గాజాలో చిన్నారికి ‘సింగపూర్’ పేరు.. కారణమిదే

కష్ట కాలంలో అన్నం పెట్టిన స్వచ్ఛంద సంస్థ పట్ల పాలస్తీనాకు చెందిన తల్లిదండ్రులు కృతజ్ఞతను చాటుకున్నారు. సింగపూర్‌కు చెందిన ‘లవ్ ఎయిడ్ సింగపూర్’ సంస్థ గాజాలో ఉచితంగా ఆహారం అందజేసింది. ఇందులో వంటమనిషిగా పనిచేసిన స్థానికుడైన హదాద్ ఇటీవల ఓ పాపకు తండ్రి అయ్యాడు. ఈ క్రమంలో తమకు అండగా నిలిచినందుకు బిడ్డకు ‘సింగపూర్’ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని ఆ సంస్థ ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా వైరలవుతోంది.