News April 12, 2025

ప్రముఖ కథక్ కళాకారిణి మృతి

image

ప్రముఖ కథక్ కళాకారిణి కుముదిని లఖియా(95) మరణించారు. ఇవాళ ఉదయం ఆమె నివాసంలో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గుజరాత్‌లోని అహ్మాదాబాద్‌లో 1930లో కుముదిని జన్మించారు. కడంబ్ సెంటర్ ఫర్ డాన్స్‌ను స్థాపించారు. కేంద్రం ఆమె సేవలను గుర్తించి ఈ ఏడాది పద్మ విభూషణ్‌ అవార్డుతో సత్కరించింది.

Similar News

News April 1, 2026

దారుణంగా పడిపోయిన ట్రంప్ రేటింగ్

image

ఇరాన్‌పై యుద్ధం విషయంలో మోనార్క్‌లా వ్యవహరిస్తున్న ట్రంప్‌పై నానాటికీ ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. AF పోస్ట్ ప్రకారం ఆయనపై ప్రజామోదం(నెట్ అప్రూవల్ రేటింగ్) ఏకంగా -17కు పడిపోయింది. ఆయన రెండో పదవీకాలంలో ఇదే అత్యల్పం కాగా పదవిలో ఉండగా ఏ ఒక్క US అధ్యక్షుడికి ఇంత తక్కువ రేటింగ్ లభించలేదు. ట్రంప్‌కు రిపబ్లికన్ల మద్దతు 92% నుంచి 84శాతానికి పడిపోయింది. 95% మంది డెమోక్రాట్ల నుంచి వ్యతిరేకత ఉంది.

News April 1, 2026

ముగిసిన నీలం సాహ్ని పదవీకాలం

image

AP: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఐదేళ్ల పదవీకాలం నిన్నటితో ముగిసింది. ఆమె స్థానంలో రిటైర్డ్ సీఎస్ నీరబ్ కుమార్‌, తదితరుల పేర్లు వినిపించినా నియామకం జరగలేదు. సాధారణ ఎన్నికలతో పాటు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలోనూ కొత్తగా రాబోయే SEC పాల్గొనాల్సి ఉంటుంది. అందుకే మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న అధికారి కోసం ప్రభుత్వం అన్వేషిస్తున్నట్లు సమాచారం. 45రోజుల్లో కమిషనర్‌ను నియమించనున్నట్లు తెలుస్తోంది.

News April 1, 2026

‘ఏఐ సెక్సువల్’.. ఇప్పుడు కొత్త ట్రెండ్!

image

ఆహారపు అలవాట్లు, ఇష్టాలే కాదు బంధాల్లోనూ కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది. అదే ‘ఏఐ సెక్సువల్’. లైంగిక విషయాల గురించి ఏఐతో పంచుకునే వాళ్లు వాళ్లను ‘ఏఐ సెక్సువల్’గా పేర్కొంటున్నారు. JoiAI అనే ప్లాట్‌ఫామ్ సర్వేలో 43% మంది లైంగిక సమస్యలపై, 37% మంది ఫ్లర్టింగ్/డేటింగ్‌పై, 33% సెక్స్ చాట్‌కు AIని వినియోగిస్తున్నట్లు తేలింది. గోప్యత, ఫ్రీగా మాట్లాడొచ్చనే ఏఐపై ఆధారపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు.