News April 14, 2024
ప్రముఖ నిర్మాత కన్నుమూత

కన్నడ ప్రొడ్యూసర్, వ్యాపారవేత్త సౌందర్య జగదీశ్(55) కన్నుమూశారు. ఆర్థిక కష్టాలతో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే గుండెపోటు వల్లే మరణించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అప్పు అండ్ పప్పు, మస్త్ మజా మాది(కిచ్చా సుదీప్), రామ్‌లీలా(చిరంజీవి సర్జా), స్నేహితరు(దర్శన్) తదితర చిత్రాలను ఈయన నిర్మించారు. కాగా నెల కిందటే జగదీశ్ కూతురు సౌందర్య వివాహం ఘనంగా జరిగింది.
Similar News
News March 5, 2026
ఇంటర్ తర్వాత ఏయే కోర్సులున్నాయంటే?

ఇంటర్‌లో MPC, BiPC, CEC, HEC, MEC చదివినవారు తర్వాత ఏం చేస్తే ఉత్తమ భవిష్యత్తు ఉంటుందో తెలుసుకుందాం. MPC చదివినవారు ఇంజినీరింగ్ వైపు వెళ్లాలనుకుంటే EAPCET రాసి బీటెక్ (B.Tech)లో చేరవచ్చు. ప్రస్తుతం ఐటీ రంగంలో డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్ (CSE), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్స్ (ECE) వంటి కోర్సులు తీసుకోవచ్చు. సివిల్, మెకానికల్ విభాగాల్లోనూ మంచి అవకాశాలున్నాయి. రేపు 2PMకు BiPC గురించి..
News March 5, 2026
డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

న్యూఢిల్లీలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీలో 10 సైంటిస్ట్ C పోస్టులకు అప్లై చేయడానికి మార్చి 14 ఆఖరు తేదీ. PhD(లైఫ్ సైన్స్/ బయో టెక్నాలజీ/ బయో కెమిస్ట్రీ/ఫార్మాస్యూటికల్/అగ్రికల్చరల్/ వెటర్నరీ సైన్సెస్), MD అర్హత గల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.67,700-రూ.2,08700 చెల్లిస్తారు. వెబ్‌సైట్: www.dbtindia.gov.in
News March 5, 2026
రోజుకు 5 గంటలే తరగతులు.. మీరేమంటారు?

ఫిన్లాండ్ విద్యా విధానం ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తోంది. ఇక్కడ విద్యార్థులు రోజుకు 4 -5 గంటలు మాత్రమే స్కూల్‌లో గడుపుతారు. ప్రతి పీరియడ్ తర్వాత 15 నిమిషాలు విరామం, తక్కువ హోంవర్క్ ఉండటం విశేషం. ఒత్తిడిలేని ఈ వాతావరణం పిల్లల్లో సృజనాత్మకతను, నేర్చుకోవాలనే ఆసక్తిని పెంచుతుందట. అంతర్జాతీయ PISA ర్యాంకింగ్స్‌లోనూ ఫిన్లాండ్ మంచి ఫలితాలు రాబడుతోంది. అక్కడ విద్య, భోజనం, రవాణా ఉచితం. ఈ విధానంపై మీ కామెంట్?


