News November 14, 2024

రేపే బాలయ్య మూవీ టీజర్.. నిర్మాత ఇంట్రెస్టింగ్ ట్వీట్

image

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కిస్తోన్న ‘NBK109’ నుంచి రేపు టైటిల్ & టీజర్‌ విడుదలవనుంది. ఉదయం 10.24 గంటలకే టీజర్ వీడియో రానుండటంతో ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నిర్మాత నాగవంశీ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘రేపు వచ్చే అదిరిపోయే BGM కోసం సిద్ధంగా ఉండండి. బాలయ్య బాబు సినిమాలకు తమన్ ఎందుకు మ్యూజిక్ అందించాలో మీకే తెలుస్తుంది’ అని చేసిన ట్వీట్ అంచనాలను పెంచేసింది.

Similar News

News October 17, 2025

సిద్ధూ ‘తెలుసు కదా’ రివ్యూ&రేటింగ్

image

అనాథ అయిన హీరో ఫ్యామిలీగా మారాలనుకునే క్రమంలో జరిగే సంఘర్షణే స్టోరీ. అందుకోసం మాజీ ప్రియురాలు(శ్రీనిధి), భార్య(రాశీ ఖన్నా)ను హీరో డీల్ చేసే విధానం, వారి మధ్య వచ్చే సెన్సిటివ్ సీన్లు ఆకట్టుకుంటాయి. సిద్ధూ మరోసారి నటనతో మెప్పించారు. BGM, సాంగ్స్ పర్లేదు. ఫస్టాఫ్ స్లో, మాస్ ఆడియన్స్‌ను మెప్పించదు. కొన్ని సీన్లు ల్యాగ్ అనిపిస్తాయి. క్లైమాక్స్‌పై డైరెక్టర్ ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది.
రేటింగ్: 2.5/5

News October 17, 2025

సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీలో అలా లేదు: ఈసీ

image

TG: స్థానిక ఎన్నికలపై హైకోర్టులో కీలక వాదనలు జరిగాయి. ‘ఎన్నికలకు వెళ్లాలని SC కూడా చెప్పింది కదా?’ అని ECని HC ప్రశ్నించింది. అయితే విచారణ సందర్భంగా అలా వ్యాఖ్యానించింది కానీ ఫైనల్ ఆర్డర్ కాపీలో ఎన్నికలకు వెళ్లాలనే ఆదేశాలు లేవని EC పేర్కొంది. రిజర్వేషన్ల అంశం కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున అది తేలేవరకు ఎలక్షన్స్ నిర్వహించలేమంది. ప్రభుత్వంతో చర్చించాకే రీనోటిఫికేషన్ ఇస్తామని HCకి వివరించింది.

News October 17, 2025

బంగారం, వెండి కొంటున్నారా?

image

ధన త్రయోదశి సందర్భంగా రేపు బంగారం, వెండి కొనుగోలు చేయడం అత్యంత శ్రేయస్కరమని పండితులు చెబుతున్నారు. అష్టైశ్వర్యాల అధినాయకురాలైన ధనలక్ష్మి కటాక్షం కోసం.. లక్ష్మీదేవి, వినాయకుడి విగ్రహాలను కొని, పూజించాలని సూచిస్తున్నారు. ఈరోజున కొత్త వస్తువులు కొనుగోలు చేస్తే రాబోయే ఏడాదంతా ఆర్థిక ఇబ్బందులు కలగవని, సంపదకు లోటుండదని అంటున్నారు. ధనలక్ష్మి అనుగ్రహంతో కృపాకటాక్షాలు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు.