News November 6, 2024
ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రద్దు.. కారణమిదే!
AP: ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 1982ని రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ 2024 బిల్లుకి క్యాబినెట్ తాజాగా ఆమోదం తెలిపింది. కాగా పాత చట్టంతో భూ ఆక్రమణలపై కేసుల నమోదులో ఇబ్బందులు వస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం అందుతున్న 80 శాతం ఫిర్యాదుల్లో భూవివాదాలే ఉన్నాయంటున్న ప్రభుత్వం, YCP హయాంలో లక్షల ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు చెబుతోంది.
Similar News
News November 6, 2024
భార్యను కౌగలించుకొని, ముద్దుపెట్టిన ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం పొందడంతో డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడా కన్వెన్షన్ సెంటర్లో తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తన భార్య మెలానియా ట్రాంప్ను కౌగలించుకొని ముద్దు పెట్టి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో తనకు మద్దతుగా ఉంటూ విజయం కోసం ఎంతో కష్టపడి పనిచేశారని ఆయన కొనియాడారు. చనిపోయిన మెలానియా తల్లి కూడా ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉండి ఉంటారని చెప్పుకొచ్చారు.
News November 6, 2024
ముగ్గురు US ప్రెసిడెంట్లతో మోదీ సావాసం
అమెరికా తదుపరి అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక లాంఛనమైపోవడంతో ఆయనకు భారతీయులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా 2014 నుంచి ముగ్గురు అధ్యక్షులు మారినా మోదీ మాత్రం భారత ప్రధానిగానే ఉన్నారని గుర్తుచేస్తున్నారు. 2014-17 వరకు ఒబామా, 2017-21 వరకు ట్రంప్, 2021- 24 వరకు బైడెన్, మళ్లీ ఇప్పుడు ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మూడు పర్యాయాలుగా మోదీ వీరితో సావాసం చేస్తున్నారు.
News November 6, 2024
ఢిల్లీకి బయల్దేరిన పవన్ కళ్యాణ్
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గన్నవరం నుంచి ఢిల్లీకి బయల్దేరారు. ఇవాళ సాయంత్రం ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. శాంతి భద్రతల అంశంపై షాతో ఆయన చర్చించనున్నట్లు తెలుస్తోంది. సమావేశం తర్వాత తిరిగి ఏపీకి పయనం కానున్నారు.