News August 27, 2025

దమ్ముంటే ఆ వ్యాఖ్యలు రిపీట్ చేయండి: స్టాలిన్‌కు BJP సవాల్

image

తమిళనాడు CM, DMK చీఫ్ స్టాలిన్ ఇవాళ బిహార్‌లో పర్యటించడంపై BJP ఫైరైంది. గతంలో DMK నేతలు చేసిన యాంటీ బిహార్, యాంటీ సనాతన కామెంట్స్‌ను గుర్తు చేస్తూ స్టాలిన్‌కు సవాల్ విసిరింది. ‘సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని మీ కొడుకు ఉదయనిధి గతంలో అన్నారు. బిహారీలు TNలో టాయిలెట్స్ కడుగుతారని మీ బంధువు, DMK MP దయానిధి కామెంట్ చేశారు. మీకు దమ్ముంటే వాటిని రిపీట్ చేయండి’ అని ఛాలెంజ్ చేసింది.

Similar News

News August 27, 2025

HYD: ట్రాఫిక్ సిగ్నల్స్.. త్వరలో రూ.72.31కోట్లతో టెండర్లు

image

HYDలో 44 ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహణ, కొత్త వాటి ఏర్పాటుకు రూ.72.31 కోట్లతో టెండర్లు పిలవనున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలియజేసింది. నిర్ణయాలను ఒక్కొక్కటిగా అమలు చేయడం కోసం అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. పనులపై కసరత్తు చేయాలనే సూచించినట్లు జీహెచ్ఎంసీ వివరించింది.

News August 27, 2025

GST రేట్స్: దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించడా..!

image

GST శ్లాబులను తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని, US టారిఫ్స్ ప్రభావం పడకుండా ఎకానమీని స్థిర పరచాలని కేంద్రం భావిస్తోంది. అయితే దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించడం లేదన్న పరిస్థితి తలెత్తొచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. పన్నులు తగ్గేంత మేర ఉత్పత్తుల ధరలు <<17529810>>పెంచాలని<<>> బీమా, సిమెంటు సహా కొన్ని కంపెనీలు భావిస్తున్నాయని వార్తలొస్తున్నాయి. వీటిపై కేంద్రం ముందే నిఘా పెట్టాలని నిపుణులు కోరుతున్నారు.

News August 27, 2025

కామన్వెల్త్ గేమ్స్.. బిడ్ వేసేందుకు క్యాబినెట్ ఆమోదం

image

2030లో భారత్‌లో కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు బిడ్ వేసేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో 72 దేశాలు పాల్గొననున్నాయి. భారత్ బిడ్ దక్కించుకుంటే గుజరాత్‌లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో గేమ్స్ జరిగే అవకాశం ఉంది. గుజరాత్‌కు గ్రాంట్ అందించేందుకు అన్ని శాఖలకు అనుమతిచ్చింది. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు భారత్‌, నైజీరియా సహా మరో రెండు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి.