News May 15, 2024

ఆర్టీసీలో త్వరలో ‘డ్రైవర్ కమ్ కండక్టర్’ పోస్టుల భర్తీ!

image

TSRTC త్వరలో 2వేల ‘డ్రైవర్ కమ్ కండక్టర్’ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. వీటికి ఎంపికైన వారు డ్రైవర్‌తో పాటు కండక్టర్ డ్యూటీ కూడా చేయాల్సి ఉంటుందట. ఈ పోస్టుల వల్ల కండక్టర్ల రిక్రూట్‌మెంట్ అవసరం ఉండదని, దీంతో జీతాల భారం తగ్గుతుందని సంస్థ భావిస్తోందట. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కొన్ని సర్వీసుల్లో డ్రైవర్లే టికెట్లు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే.

Similar News

News March 4, 2026

ఇరాన్-US యుద్ధం.. కిమ్ జోంగ్‌పై పేలుతున్న మీమ్స్

image

ఇరాన్-US, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్‌పై నెట్టింట మీమ్స్ హల్‌చల్ చేస్తున్నాయి. తరచూ అణు పరీక్షలతో కాలుదువ్వే ఆయనతో యుద్ధానికి ఎవరూ రావడం లేదంటూ సెటైర్లు వేస్తున్నారు. తనను పట్టించుకోవడం లేదని కిమ్ బాధపడుతున్నట్లు, ఆయుధాలతో ఎదురు చూస్తున్నట్లు, ఎవరైనా అటాక్ చేశారా అని ఆకాశంలోకి చూస్తున్నట్లు పోస్టులు చేస్తున్నారు. కొన్ని మీమ్స్ పైన ఫొటోల్లో చూడొచ్చు.

News March 4, 2026

ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాకు భారీ ఎదురుదెబ్బ!

image

అమెరికా-ఇజ్రాయెల్ ముప్పేట దాడి చేస్తున్నా ఇరాన్ తగ్గట్లేదు. ఈ క్రమంలో ఖతర్‌లోని యూఎస్ స్పేస్ ఫోర్స్‌కు చెందిన బాలిస్టిక్ మిస్సైల్ ఎర్లీ వార్నింగ్ రాడార్ సిస్టమ్‌ను ఇరాన్ డ్రోన్లతో నాశనం చేసింది. మొత్తంగా $1.1 బిలియన్లు నష్టం సంభవించినట్లు నిపుణుల అంచనా. దీనివల్ల గల్ఫ్ దేశాల్లో మిస్సైల్స్ దాడులను గుర్తించే వ్యవస్థ దెబ్బతినిందని, US దళాలు కొంతకాలం బ్లైండ్‌గా ఆపరేట్ చేయాల్సి వస్తుందని చెబుతున్నారు.

News March 4, 2026

ఇరాన్‌పై 3 డేంజరస్ బాంబర్లతో US దాడి

image

ఇరాన్‌పై అమెరికా 3 భారీ బాంబర్లను ఉపయోగించింది. అవి B-52 స్ట్రాటోఫోర్ట్రెస్, B-1 లాన్సర్, B-2 స్పిరిట్. B-52 స్ట్రాటోఫోర్ట్రెస్ 31వేల KGల బరువైన బాంబులను మోసుకెళ్తుంది. B-1 లాన్సర్ సూపర్‌సోనిక్, ఫాస్టెస్ట్ బాంబర్. ఇది 35వేల కేజీల బాంబులను శత్రు స్థావరాలపై వేస్తుంది. ఇక B-2 స్పిరిట్ మోస్ట్ డేంజరస్. రాడార్లకు చిక్కకుండా 50వేల అడుగుల ఎత్తుపై నుంచి బాంబులను వదులుతుంది. దీని ధర దాదాపు ₹20వేల కోట్లు.