News August 7, 2024
మరో వారంలో నామినేటెడ్ పదవుల భర్తీ?

AP: నామినేటెడ్ పదవులపై CM చంద్రబాబు కసరత్తు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. మరో వారం, పది రోజుల్లో ఈ పదవులను భర్తీ చేయనున్నట్లు సమాచారం. తొలివిడతగా కొన్ని పదవులు భర్తీ చేయనున్నారు. పోస్టులన్నీ ఒకేసారి భర్తీ చేయకుండా దశల వారీగా పూర్తి చేయనున్నారు. వీటిలో మిత్రపక్షాలు JSP, BJPకి 20 శాతం పోస్టులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. సామాజిక, ప్రాంతీయ సమీకరణాల ప్రకారం వీటిని భర్తీ చేయనున్నారు.
Similar News
News December 22, 2025
చంద్రబాబుపై కేసీఆర్ వ్యాఖ్యలు 100% నిజం: అమర్నాథ్

AP: చంద్రబాబుపై KCR చేసిన <<18634035>>వ్యాఖ్యలు<<>> 100% నిజమని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ‘కేసీఆర్ ఎప్పుడూ అబద్ధాలు మాట్లాడలేదు. అందుకే ఆయన అంతపెద్ద నేత అయ్యారు. KCR వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నా’ అని చెప్పారు. జగన్ అంటే కూటమి నేతలు భయపడుతున్నారన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని, అందుకే వైసీపీలోకి చేరుతున్నారని చెప్పారు.
News December 22, 2025
కొత్త పథకాలపై ప్రభుత్వం కసరత్తు

TG: వచ్చే బడ్జెట్లో మరో 5 కొత్త పథకాలను ప్రకటించేలా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఆయా విభాగాల నుంచి ప్రతిపాదనలను రప్పిస్తోంది. నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులు, యువతను దృష్టిలో పెట్టుకొని వీటికి రూపకల్పన చేయిస్తోంది. ఈ పథకాలకు ఆర్థిక వనరుల లభ్యతపై ఆర్థిక శాఖ కసరత్తు చేపట్టింది. కాగా ఎన్నికల హామీ అయిన పెన్షన్ పెంపుపై ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
News December 22, 2025
పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్య

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలోని ఒక యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న ప్రిన్సీ కుమారి (20) ఆత్మహత్య చేసుకుంది. ఝార్ఖండ్‌కు చెందిన ఆమె బీటెక్ సెకండ్ ఇయర్(CSE) చదువుతూ హాస్టల్లో ఉంటోంది. బ్యాక్‌లాగ్‌లు ఉండటంతో పరీక్షల ఒత్తిడి కారణంగా తీవ్ర మానసిక ఆందోళనకు గురైనట్లు సమాచారం. ‘సారీ మమ్మీపప్పా.. మీ అంచనాలు అందుకోలేకపోతున్నా. బాధగా ఉంది. చనిపోతున్నా’ అంటూ సూసైడ్ నోట్ రాసింది.


