News June 11, 2024

పేపర్ లీకేజీ ఆరోపణలపై సమాధానం చెప్పండి: SC

image

నీట్-యూజీ పరీక్ష ప్రాముఖ్యతను కాపాడాల్సిన బాధ్యత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA)పై ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పేపర్ లీకైందని, పరీక్షను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సమాధానం చెప్పాలని NTAకు నోటీసులు జారీ చేసింది. కౌన్సెలింగ్ ప్రక్రియపై స్టేకు నిరాకరించిన ధర్మాసనం జులై 8కి విచారణను వాయిదా వేసింది.

Similar News

News October 6, 2024

ఊసరవెల్లి రాజకీయాలకు కేరాఫ్ బాబు: VSR

image

AP: రాజకీయ పబ్బం గడుపుకొనేందుకు సీఎం చంద్రబాబు ఊసరవెల్లిలా ఎప్పటికప్పుడు వేషాలు మారుస్తుంటారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ‘చంద్రబాబు మనోగతం! రంజాన్, మిలాద్ ఉన్ నబి అయిపోయాయి. దసరా పండుగ అయిపోవస్తోంది. ఇప్పుడు అర్జంట్‌గా బైబిల్ కావాలి. ఎక్కడ, ఎక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్. క్రిస్మస్ దగ్గరకు వచ్చేస్తోంది. వేషం మార్చాలి’ అని ఆయన ట్వీట్ చేశారు.

News October 6, 2024

ఇజ్రాయెల్‌ దాడిలో 26మంది మృతి: హమాస్

image

గాజాపై ఇజ్రాయెల్ చేసిన తాజా దాడిలో ఓ మసీదులో 26మంది ప్రాణాలు కోల్పోయారని హమాస్ తెలిపింది. డెయిర్ అల్-బలాలో ఉన్న ఆ మసీదులో శరణార్థులు తల దాచుకున్నారని పేర్కొంది. అనేకమంది తీవ్రగాయాలపాలయ్యారని ఆవేదన వ్యక్తం చేసింది. అటు ఇజ్రాయెల్ ఆ ప్రకటనను ఖండించింది. హమాస్ ఉగ్రవాదులు తలదాచుకున్న ప్రాంతాన్ని తాము అత్యంత కచ్చితత్వంగా గుర్తించి ధ్వంసం చేశామని, అందులో హమాస్ కమాండ్ సెంటర్ ఉందని పేర్కొంది.

News October 6, 2024

IPL Rules: ఈ యంగ్ క్రికెటర్లు ఇక కోటీశ్వరులు!

image

మారిన IPL రిటెన్షన్ పాలసీతో యంగ్ క్రికెటర్లు రూ.కోట్లు కొల్లగొట్టబోతున్నారు. వేలానికి ముందు ఫ్రాంచైజీలు ఆరుగురిని రిటెయిన్ చేసుకోవచ్చు. ఐదుగురు క్యాప్డ్ (భారత, విదేశీ), గరిష్ఠంగా ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లను తీసుకోవచ్చు. బంగ్లా టీ20 సిరీసుకు మయాంక్ యాదవ్ LSG, నితీశ్ కుమార్ SRH, హర్షిత్ రాణా KKR ఎంపికయ్యారు. దీంతో వీరిని తీసుకుంటే రూ.11-18 కోట్లు ఇవ్వాల్సిందే. రింకూ సైతం కోటీశ్వరుడు అవుతారు.