News February 8, 2025
రెపోరేటు తగ్గింపు.. EMI ఎంత తగ్గుతుందంటే?

RBI రెపోరేటును 6.25శాతానికి తగ్గించింది. దీంతో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై EMI కూడా తగ్గనుంది. 20 ఏళ్ల కాలపరిమితికి రూ.20 లక్షల ఇంటి రుణం తీసుకున్న వారికి ఏడాదికి రూ.3,816, రూ.30 లక్షలైతే రూ.5,712, రూ.50 లక్షలు తీసుకుంటే రూ.9,540 తగ్గుతుంది. అలాగే ఐదేళ్ల కాలపరిమితికి కారు లోన్లు తీసుకుంటే రూ.5 లక్షలకు ఏడాదికి రూ.732, రూ.7 లక్షలకు రూ.1020, రూ.10 లక్షలకు రూ.1464 వరకు EMI తగ్గుతుంది.
Similar News
News March 8, 2026
1,300 ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(IDBI)లో 1,300 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 1,100 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్, 200 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులున్నాయి. వయసు 21-30 ఏళ్లు, డిగ్రీ పాసైన వారు అర్హులు. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 19.
వెబ్‌సైట్: https://www.idbi.bank.in/
News March 8, 2026
బంగ్లాలో ‘Gen Z’ పార్టీ ఎందుకు ఓడింది?(1/2)

బంగ్లాదేశ్‌లో హసీనా, నేపాల్‌లో కేపీ శర్మ ప్రభుత్వాలు కూలిపోవడానికి Gen Z నిరసనలే కారణం. అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా యువత పోరాటం చేసింది. అయితే బంగ్లాలో స్టూడెంట్స్ నహిద్, హస్నాత్, అఖ్తర్ ఏర్పాటుచేసిన నేషనల్ సిటిజన్ పార్టీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. హింసను నమ్ముకోవడం, ప్రజలకు భరోసా కల్పించలేకపోవడం, రాజకీయ అనుభవలేమి, వివాదాలు ప్రధాన కారణం. అటు నేపాల్‌లో Gen Z ఎన్నికల్లో సత్తా చాటింది.
News March 8, 2026
నేపాల్‌లో ‘Gen Z’ ఎలా గెలిచింది?(2/2)

నేపాల్‌లో కేపీ శర్మ ప్రభుత్వం SMపై నిషేధం విధించడంతో Gen Z తిరుగుబాటు చేసింది. ఈ ఉద్యమంలో బాలెన్ షా కీలక పాత్ర పోషించారు. ర్యాపర్‌గా రాజకీయ అవినీతి, ప్రజాసమస్యలను పాటల రూపంలో వివరించారు. నిరసనల సమయంలోనే PM ఆఫర్ వచ్చినా ఆయన తిరస్కరించి కాఠ్‌మాండూ మేయర్‌గా గెలిచారు. తర్వాత రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ(RSP)లో చేరి ప్రజల ఇబ్బందులపై దృష్టిసారించారు. యువతను సరైన దారిలో నడిపిస్తూ గెలుపు బావుటా ఎగురవేశారు.


