News April 6, 2024
ఆగస్టు తర్వాతే రెపో రేటులో కోతలు: సిద్ధార్థ సన్యాల్

ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే విషయంలో ఆర్బీఐ నిర్ణయాలను బాగున్నాయని ఆర్థికవేత్త సిద్ధార్థ సన్యాల్ కొనియాడారు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందన్నారు. ఆగస్టు తర్వాతే రెపో రేటు (ప్రస్తుత 6.5శాతం) కోతలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లో సీపీఐ ద్రవ్యోల్బణం 4శాతం తగ్గొచ్చని.. దీంతో రెపో రేటు 50-100 బేసిస్ పాయింట్లు తగ్గొచ్చని అన్నారు.
Similar News
News December 16, 2025
AP-RCET ఫలితాలు విడుదల

పీహెచ్డీ సీట్ల భర్తీకి నిర్వహించే AP-RCET(రీసెర్చ్ కామన్స్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాలు విడుదలయ్యాయి. శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ ఆధ్వర్యంలో గత నెల నవంబరులో పరీక్షలు జరిగాయి. మొత్తం 65 సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించగా, 5,164 మంది ఎగ్జామ్స్ రాశారు. వారిలో 2,859 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఏపీ ఆర్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్.ఉష తెలిపారు. ఇక్కడ <
News December 16, 2025
బరువు తగ్గినప్పుడు ఫ్యాట్ బయటికెలా వెళ్తుంది?

శరీరంలో కొవ్వు ట్రైగ్లిజరైడ్స్ రూపంలో నిల్వ ఉంటుంది. డైట్, వ్యాయమం వల్ల కేలరీలు తగ్గించినప్పుడు శరీరం ఆ కొవ్వును ఆక్సిడైజ్ చేసి శక్తిగా మారుస్తుంది. ఈ ప్రక్రియలో ఫ్యాట్ కరిగి కార్బన్ డై ఆక్సైడ్, నీరుగా విడిపోతుంది. 84% కార్బన్ డై ఆక్సైడ్‌గా మారి ఊపిరితో, 16% నీరుగా మారి చెమట, యూరిన్ ద్వారా బయటకు వెళ్తాయి. ఉదా. 10కిలోల ఫ్యాట్ తగ్గితే 8.4KGలు C02గా ఊపిరి ద్వారా, 1.6KGలు నీరుగా విసర్జింపబడతాయి.
News December 16, 2025
లిస్టులోకి మరో 19మంది ప్లేయర్లు.. నేడే మినీ వేలం

IPL మినీ వేలం లిస్టులో అభిమన్యు ఈశ్వరన్‌తో సహా 19 మంది ప్లేయర్లు చేరారు. దీంతో ఆక్షన్‌లో పాల్గొనే మొత్తం ఆటగాళ్ల సంఖ్య 369కి చేరింది. వేలానికి ముందు కొత్త ప్లేయర్లను చేర్చడం కొత్త విషయం కాకపోయినా ఇంతమంది యాడ్ కావడం ఇదే తొలిసారి అని BCCI తెలిపింది. నేడు గరిష్ఠంగా 77 మందిని కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ఇవాళ 2.30PM నుంచి అబుదాబిలో ఆక్షన్ ప్రారంభం కానుంది. KKR పర్సులో అత్యధికంగా రూ.64.30CR ఉన్నాయి.


