News August 30, 2024
ప్రతి 3 గంటలకు ఒకసారి నాకు రిపోర్ట్ చేయండి: CM
గుడ్లవల్లేరు కాలేజీలో <<13972426>>వీడియోల<<>> రికార్డింగ్‌పై నేరం రుజువైతే కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మన ఇంట్లో ఆడబిడ్డలకు కష్టం వస్తే ఎలా స్పందిస్తామో అంతే సీరియస్‌గా స్పందించి నిజాలు నిగ్గు తేల్చాలన్నారు. విద్యార్థుల ఫిర్యాదును కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణపైనా విచారణ జరపాలని ఆదేశించారు. ప్రతి 3 గం.కు ఒకసారి ఈ ఘటనపై తనకు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
Similar News
News January 31, 2025
బాత్రూమ్లోనే టూత్‌బ్రష్ పెడుతున్నారా?
దంతాలను శుభ్రం చేసుకున్నాక <<15261921>>టూత్‌బ్రష్‌లను<<>> బాత్రూమ్లోనే పెట్టడం ప్రమాదమని సిద్దిపేట GOVT డిగ్రీ కాలేజీ విద్యార్థుల అధ్యయనంలో తేలింది. కమోడ్ ఫ్లష్ చేసినప్పుడు నీతి తుంపర్ల ద్వారా 3రకాల బ్యాక్టీరియా బ్రష్‌లపైకి చేరుతోందని గుర్తించారు. స్ట్రెప్టోకోకస్ వల్ల దంతాల అరుగుదల, స్టెఫైలోకోకస్ ఆర్యస్తో మౌత్ అల్సర్, ఈ-కొలి వల్ల జీర్ణ సమస్యలు వస్తున్నాయని చెప్పారు. బ్రష్‌లను ఎండ తగిలే చోట పెట్టాలంటున్నారు.
News January 31, 2025
రేపటి నుంచే భూముల మార్కెట్ ధరల పెంపు
APవ్యాప్తంగా రేపటి నుంచి భూముల మార్కెట్ ధరలు, రిజిస్ట్రేషన్ రేట్లు పెరగనున్నాయి. ఆయా ప్రాంతాల అభివృద్ధి ప్రాతిపదికన 10-20% పెంపు ఉండనుంది. నగర పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో నిర్మాణ విలువలపైనా 6% వరకు పెంపు ఉంటుంది. పెంకుటిళ్లు, రేకుల షెడ్లు, ఇతర వాటికి చదరపు అడుగుకు ₹740, ₹580, ₹420 వసూలు చేస్తారు. ప్లాట్లకు(G,1st, 2nd ఫ్లోర్)రూ.1,490, రూ.1,270, రూ.900 వసూలుకు నిర్ణయించారు.
News January 31, 2025
లిక్కర్ స్కాంలో కవిత: కేరళ ప్రతిపక్ష నేత
TG: ఢిల్లీ తరహాలో కేరళలోనూ లిక్కర్ స్కామ్ జరిగిందని, ఇందులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక పాత్ర పోషించారని ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ ఆరోపించారు. ‘పాలక్కడ్‌లోని ఒయాసిస్ కమర్షియల్ కంపెనీకి మద్యం తయారీ పర్మిషన్ ఇచ్చారు. సీఎం పినరయి, ఎక్సైజ్ మంత్రి రాజేశ్ ఏకపక్షంగా అనుమతులు ఇచ్చారు. ఈ వ్యవహారాన్ని కవితనే కేరళకు వచ్చి మరీ నడిపించారు’ అని చెప్పారు. ఈ వ్యాఖ్యలను కవిత ఖండించారు.