News August 11, 2025
‘ఆడుదాం ఆంధ్ర’పై నేడు ప్రభుత్వానికి నివేదిక

AP: ‘ఆడుదాం ఆంధ్ర’ నిర్వహణలో అవినీతి జరిగిందన్న ఫిర్యాదులపై విజిలెన్స్ అధికారులు విచారణ ముగించారు. ఇవాళ 30 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు. కిట్ల కొనుగోలు, పోటీల నిర్వహణలో రూ.40కోట్ల మేర అవినీతి జరిగిందని ఆరోపణలున్నాయి. విచారణలో నిధుల దుర్వినియోగం జరిగిందని తేల్చినట్లు సమాచారం. మాజీమంత్రి రోజా, శాప్ మాజీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు కనిపిస్తోంది.
Similar News
News August 11, 2025
ప్రయాణికుల భద్రత లక్‌పై ఆధారపడకూడదు: కాంగ్రెస్ MP

ఎయిర్ ఇండియా విమానంలో ఎదురైన భీతావహ అనుభవంపై INC MP KC వేణుగోపాల్ ట్వీట్ చేశారు. ‘నేను, ఇతర MPలు త్రివేండ్రం నుంచి ఢిల్లీ వెళ్తుండగా సాంకేతిక సమస్యతో పైలట్ విమానాన్ని చెన్నైకి మళ్లించారు. 2hrs గాల్లోనే ఎయిర్‌పోర్ట్ చుట్టూ తిరిగాం. ల్యాండింగ్ సమయంలో రన్‌వేపై మరో ఫ్లైట్ ఉండటం చూసి పైలట్ రెప్పపాటులో అప్రమత్తమయ్యారు. ప్రయాణికుల భద్రత లక్‌పై ఆధారపడకూడదు. దీనిపై విచారణ చేపట్టాలి’ అని డిమాండ్ చేశారు.
News August 11, 2025
డీఎస్సీ ఫలితాలపై నేడో, రేపో స్పష్టత

AP: మెగా డీఎస్సీ-2025 ఫలితాలపై ఇవాళ లేదా రేపు స్పష్టత వచ్చే అవకాశముంది. ఇటీవల ఫైనల్ కీ విడుదల కాగా.. అందులో తప్పులున్నాయని పలువురు అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వాటిపై విద్యాశాఖ అధికారులు నిపుణుల కమిటీతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇదే సమయంలో ఈ నెల 25లోపు ఫలితాలు ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మెగా డీఎస్సీ ద్వారా ప్రభుత్వం 16,347 పోస్టులను భర్తీ చేయనుంది.
News August 11, 2025
పాక్‌ను దెబ్బకొట్టిన ‘వార్ హీరో’ మూవీ తెలుసా?

IAF లెజెండ్ DK పరుల్కర్(రిటైర్డ్) <<17366693>>కన్నుమూసిన<<>> విషయం తెలిసిందే. ఆయన తెగువపై ‘ది గ్రేట్ ఇండియన్ ఎస్కేప్’ అని చిత్రం కూడా వచ్చింది. 1971 ఇండో-పాక్ యుద్ధం టైంలో పరుల్కర్‌ను పాక్ సైన్యం బంధించి రావల్పిండిలో ఖైదీగా ఉంచింది. శత్రుదేశంలో ఉన్నా అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి తనతోపాటు మరో ఇద్దరు పైలట్స్‌నూ తప్పించారు. దేశానికి చేసిన సేవలకు గానూ ఆయన వాయుసేన, విశిష్ఠ్ సేవా మెడల్స్ అందుకున్నారు.