News April 10, 2024
కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత

TG: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత పేరును కేసీఆర్ ప్రకటించారు. స్థానిక నేతలతో చర్చించిన అనంతరం దివంగత సాయన్న కుమార్తెను అభ్యర్థిగా ఎంపిక చేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఈ స్థానంలో మే 13న ఉపఎన్నిక జరగనుంది.
Similar News
News January 9, 2026
రాజాసాబ్ టికెట్ హైక్ మెమో సస్పెండ్

రాజాసాబ్ మూవీ టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ ప్రభుత్వ మెమోను హైకోర్టు కొట్టేసింది. దీంతో పాత రేట్లకే టికెట్లు విక్రయించాల్సి ఉంటుంది. కాగా తెలంగాణ హోంశాఖ కార్యదర్శి అర్ధరాత్రి తర్వాత హైక్ మెమో ఇచ్చారని, తనకు ఆ అధికారం లేదని లాయర్ శ్రీనివాస్ HCకి వెళ్లారు. దీంతో ఇకపై మెమోలు జారీ చేయొద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒకవేళ రేట్స్ పెంచాలి అనుకుంటే జీవో 120 ప్రకారం రూ.350 మించకూడదని తేల్చిచెప్పింది.
News January 9, 2026
ట్రంప్కు ఇరాన్ సుప్రీం లీడర్ స్ట్రాంగ్ కౌంటర్

ఇరాన్లో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఆ దేశ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తొలిసారి స్పందించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జారీ చేస్తున్న హెచ్చరికలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘కోపిష్టి అయిన ట్రంప్ చేతులు ఇరాన్ పౌరుల రక్తంతో తడిచాయి. అతను స్వదేశంలోని సమస్యలపై ఫోకస్ చేయడం మంచిది. వేరే దేశాధ్యక్షుడి మెప్పుకోసం ఇరాన్లో నిరసనకారులు తమ వీధులను పాడు చేసుకుంటున్నారు’ అని అసహనం వ్యక్తం చేశారు.
News January 9, 2026
మళ్లీ పెరిగిన బంగారం ధర!

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు గంటల వ్యవధిలోనే మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ మొత్తం రూ.1,310 పెరిగి రూ.1,39,310కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,200 ఎగబాకి రూ.1,27,700 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.4వేలు తగ్గి రూ.2,68,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


