News January 22, 2026
Republic day Special: మేడం బికాజీ కామా

బొంబాయిలో పార్శీ కుటుంబంలో జన్మించిన బికాజీ కామా దాదాభాయ్ నౌరోజీ, శ్యాంజీ కృష్ణవర్మల ప్రేరణతో స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. ప్లేగు వ్యాధి చికిత్స కోసం లండన్ వెళ్లి అక్కడ భారతదేశ విప్లవకారులకు మార్గదర్శిగా మారారు. ‘ఫ్రీ ఇండియా సొసైటీ’ని స్థాపించారు. ‘వందేమాతరం’ పత్రికను నడిపారు. 1907లో జర్మనీలో మొదటిసారిగా భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈమెను ‘భారత విప్లవకారుల మాత’గా అభివర్ణిస్తారు.
Similar News
News February 18, 2026
ADB: కలప రవాణా ఇక పూర్తిగా ఆన్‌లైన్

కలప రవాణా నిబంధనల్లో కేంద్రం కీలక మార్పులు చేసింది. ఇకపై సామిల్లులకు ఆఫ్‌లైన్ పర్మిట్ల విధానాన్ని రద్దు చేస్తూ పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ (NTPS) ద్వారా అనుమతులు జారీ చేయనుంది. పర్మిట్ జారీ చేసిన 24 గంటల్లోపు కలపను గమ్యస్థానానికి చేర్చాల్సి ఉంటుంది. గడువు దాటితే పోర్టల్‌లో మళ్లీ అప్‌డేట్ చేయాల్సిందే. ఉమ్మడి జిల్లాలోని 35కు పైగా సామిల్లుల నుంచి 2 తెలుగు రాష్ట్రాలకు జరిగే కలప రవాణాపై నిఘా పెరగనుంది.
News February 18, 2026
నెదర్లాండ్స్‌తో మ్యాచ్.. భారత్ బ్యాటింగ్

T20WC: అహ్మదాబాద్‌లో నెదర్లాండ్స్‌తో నామమాత్రపు మ్యాచులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అక్షర్ స్థానంలో సుందర్, కుల్దీప్ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ జట్టులోకి వచ్చారు.
IND: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్య (C), హార్దిక్ పాండ్య, దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా.
News February 18, 2026
టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(TCIL) 24 కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 21, 22 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి BE/BTech/MCA, MBA, BSc/BCom/BCA అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://www.tcil.net.in


