News June 23, 2024
అమరావతికి రూ.15 వేల కోట్లు కేటాయించాలని వినతి

AP: అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు కేటాయించాలని కేంద్రాన్ని కోరినట్లు ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. పోలవరం నిర్మాణానికి సహకారం అందించాలని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశామన్నారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని అడిగినట్లు పేర్కొన్నారు. కడప స్టీల్ ప్లాంట్, రామాయపట్నం పోర్ట్, రైల్వే జోన్‌కు సహకారం అందించాలని కోరామన్నారు.
Similar News
News November 6, 2025
బయోమాస్‌తో రైతులకు ఆదాయం, ఉపాధి: సారస్వత్

AP: గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి బయోమాస్ ఎంతో ఉపయుక్తమని AP గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అడ్వయిజరీ బోర్డు ఛైర్మన్ సారస్వత్ పేర్కొన్నారు. బయోమాస్‌లో ఏపీ నం.1గా ఉందన్నారు. రైతులకు ఆదాయంతో పాటు ఉపాధి మెరుగుపడుతుందని బోర్డు భేటీలో చెప్పారు. విశాఖ(D) పూడిమడక వద్ద ₹1.85 L కోట్లతో NGEL హైడ్రోజన్ హబ్‌ను నెలకొల్పుతోందని CS విజయానంద్ తెలిపారు. రోజుకు 1,500 టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తారని చెప్పారు.
News November 6, 2025
జుట్టుకు రంగు వేస్తున్నారా?.. జాగ్రత్త!

పదేపదే హెయిర్ డై లేదా కలరింగ్ చేసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుందని ముంబై హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ అభిషేక్ పిలానీ హెచ్చరించారు. ‘తరచుగా రంగులు వేయడం వల్ల జుట్టులోని కెరాటిన్ దెబ్బతిని పెళుసుగా మారడం, చివర్లు చిట్లడం జరుగుతుంది. అమోనియా, పెరాక్సైడ్ వంటి తీవ్రమైన రసాయనాలు జుట్టుకు శాశ్వత నష్టం కలిగిస్తాయి. జుట్టు రాలడం, పలుచబడటం వంటి సమస్యలు తీవ్రమవుతాయి’ అని పేర్కొన్నారు.
News November 6, 2025
బీఆర్ఎస్ ఫేక్ సర్వేలను తిప్పికొట్టండి: రేవంత్

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలవబోతున్నామని మంత్రులతో మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బైపోల్‌పై ఆయన వారితో సమీక్ష నిర్వహించారు. మిగిలిన 3 రోజుల్లో ప్రచారంలో దూకుడు పెంచాలని సూచించారు. సోషల్ మీడియాలో రోజుకో ఫేక్ సర్వే వదులుతూ ప్రజలు, ఓటర్లను బీఆర్ఎస్ గందరగోళానికి గురి చేస్తోందని, దీన్ని సమర్థంగా తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. పోల్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టాలన్నారు.


