News July 6, 2024
అనంతపురంలో ఎయిర్‌పోర్టు కట్టాలని వినతి

AP: అనంతపురంలో ఎయిర్‌పోర్టుతో పాటు విమానయాన సిబ్బంది శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌ను అనంతపురం, హిందూపురం MPలు కోరారు. ఉద్యాన పంటలైన పూలు, పండ్లు, కూరగాయల ఎగుమతితో పాటు ప్రయాణికుల అవసరాలు తీర్చేలా ఎయిర్‌పోర్టు ఉండాలని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ వినతిపత్రం సమర్పించారు. ఎయిర్‌పోర్టు నిర్మాణం కరవు పీడిత ప్రాంతానికి వరంగా మారడంతోపాటు, యువతకు ఉపాధి లభిస్తుందన్నారు.
Similar News
News November 20, 2025
పోలి పాడ్యమి రోజున 30 వత్తులు ఎందుకు?

కార్తీక మాసంలోని 30 రోజులకు ప్రతీకగా పోలి పాడ్యమి రోజున 30 వత్తులు వెలిగిస్తారు. కార్తీక మాసంలో దీపారాధన చేయలేని వారు, ఈ ఒక్క రోజు 30 వత్తులు వెలిగిస్తే, అన్ని రోజుల పుణ్యం లభిస్తుందని నమ్మకం. కొందరు 31 వత్తుల దీపాన్ని కూడా పెడతారు. మరికొందరు గంగాదేవిని ఆరాధిస్తూ 2, గణపతి కోసం 2 పెడతారు. అదనంగా 4 వత్తుల దీపం పెట్టేవారు కూడా ఉంటారు. ఈ నియమం ప్రకారం.. 30-35 ఎన్ని వత్తుల దీపమైనా వెలిగించవచ్చు.
News November 20, 2025
ఢిల్లీ బ్లాస్ట్: అల్ ఫలాహ్‌లో 10 మంది మిస్సింగ్!

ఢిల్లీ పేలుడు మూలాలు అల్ ఫలాహ్ యూనివర్సిటీలో బయటపడిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన తర్వాత వర్సిటీకి చెందిన 10 మంది కనిపించకుండా పోయినట్లు సమాచారం. ఇందులో ముగ్గురు కశ్మీరీలు కూడా ఉన్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. వాళ్లందరి ఫోన్లు స్విచ్చాఫ్‌లో ఉన్నట్లు చెప్పాయి. ఆ 10 మంది టెర్రర్ డాక్టర్ మాడ్యూల్‌కు చెందిన వారు కావచ్చని అనుమానిస్తున్నాయి. బ్లాస్ట్ వెనుక జైషే మహ్మద్ ఉండొచ్చని వెల్లడించాయి.
News November 20, 2025
కొత్త సినిమాల కబుర్లు

* పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ అవుతుందని నిర్మాత రవి శంకర్ వెల్లడి.
* బాక్సాఫీస్ రారాజు వస్తున్నాడంటూ రాజాసాబ్ టీమ్ ట్వీట్. డిసెంబర్ 4న నార్త్ అమెరికా బుకింగ్స్ ఓపెన్ అవుతాయని ప్రకటన.
* తమిళ హీరో సూర్యకు టాలీవుడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కథ చెప్పినట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించే అవకాశం ఉందని చర్చ.


