News January 16, 2025

సెలవులు పొడిగించాలని వినతి

image

సంక్రాంతి సెలవుల తర్వాత తెలంగాణలో కాలేజీలు శుక్రవారం నుంచి, స్కూళ్లు శనివారం నుంచి పున:ప్రారంభం కానున్నాయి. అయితే తమ పిల్లలను ఆ రోజుల్లో పంపించబోమని, సోమవారం పంపుతామని కొందరు తల్లిదండ్రులు చెబుతున్నారు. శనివారం కూడా హాలిడే ఇవ్వాలని కోరుతున్నారు. అటు ఏపీలో స్కూళ్లు సోమవారం నుంచి తెరుచుకోనున్నాయి. మరి మీరెప్పుడు స్కూల్/కాలేజీకి వెళ్తున్నారో కామెంట్ చేయండి.

Similar News

News January 16, 2025

సెల్యూట్ ISRO: నాలుగో దేశంగా ఎలైట్ క్లబ్‌లోకి భారత్

image

భారత్ అద్భుతం చేసింది. స్పేస్ డాకింగ్ టెక్నాలజీలో నైపుణ్యం సాధించిన నాలుగో దేశంగా అవతరించింది. US, రష్యా, చైనా సరసన నిలిచింది. SpaDeX విజయవంతమైనట్టు ISRO ప్రకటించడం తెలిసిందే. స్పేస్‌లో 2 వేర్వేరు శాటిలైట్లను అనుసంధానంతో సింగిల్ ఆబ్జెక్ట్‌గా మార్చేసింది. ఛైర్మన్ నారాయణన్, మోదీ, కేంద్ర మంత్రులు ISRO సైంటిస్టులను అభినందించారు. స్పేస్ స్టేషన్, చంద్రయాన్ 4, గగన్‌యాన్‌కు ఇది మార్గం సుగమం చేసిందన్నారు.

News January 16, 2025

గ్రౌండ్ స్టాఫ్‌కు MCA జంబో గిఫ్ట్ హాంపర్స్.. ఏమేం ఉన్నాయంటే?

image

వాంఖడే స్టేడియానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ముంబై క్రికెట్ అసోసియేషన్ 178 మంది గ్రౌండ్ స్టాఫ్‌కు జంబో గిఫ్ట్ హాంపర్స్ అందజేసింది. ఇందులో 5 కిలోల చొప్పున గోధుమ పిండి, బియ్యం, పప్పు, ఒక మిక్సర్ గ్రైండర్, హైడ్రేషన్ కిట్స్, బ్యాక్ ప్యాక్స్, కిట్ బ్యాగ్, టవల్స్, పెన్స్, నోట్ పాడ్స్, బెడ్ షీట్స్, ట్రాక్ పాంట్స్, జాకెట్స్, సన్ గ్లాసెస్, హాట్స్, రెయిన్ కోట్, అంబ్రెల్లా, సన్ స్క్రీన్ వంటివి ఉన్నాయి.

News January 16, 2025

పెరిగిన బంగారం ధరలు

image

ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రా. 24 క్యారెట్ల గోల్డ్ రూ.550 పెరిగి రూ.80,620కి చేరింది. 22క్యారెట్ల పసిడి రూ.500 పెరిగి రూ.73,900 పలుకుతోంది. కేజీ వెండి రూ.100 పెరిగి రూ.1,01,100కు చేరింది.