News June 22, 2024
టెట్ మళ్లీ నిర్వహించాలని మంత్రి లోకేశ్‌కు వినతి

AP: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET)ను మళ్లీ నిర్వహించాలని మంత్రి నారా లోకేశ్‌కు టీడీపీ ఎమ్మెల్సీలు శ్రీకాంత్, చిరంజీవి, రామ్‌గోపాల్ విజ్ఞప్తి చేశారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌కు సీఎం చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి టెట్ నిర్వహించాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
Similar News
News November 22, 2025
గద్వాల్: సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం ఖరారు

తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 26న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. వచ్చే నెల డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరగనున్నాయి. సోమవారం రోజున గ్రామాల వారీగా రిజర్వేషన్ల రోస్టర్ విడుదలకు రంగం సిద్ధమైంది. గద్వాల్ జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
News November 22, 2025
వనజీవి జీవితంపై సినిమా మొదలు!

తెలంగాణ ‘వనజీవి’గా పేరుగాంచిన పద్మశ్రీ అవార్డు గ్రహీత రామయ్య జీవిత చరిత్ర సినిమా రూపంలో తెరకెక్కనుంది. ఖమ్మంలో ఈ బయోపిక్‌ను లాంఛనంగా ప్రారంభించారు. వనజీవి రామయ్య తన జీవితాన్ని లక్షలాది మొక్కలను నాటడానికి, రక్షించడానికి అంకితం చేసిన విషయం తెలిసిందే. ఆయన ఆదర్శవంతమైన, నిరాడంబర జీవన విధానం, పర్యావరణ భక్తిని ఈ సినిమా వెండితెరపైకి తీసుకురానుంది. ఆయన పాత్రలో నటుడు బ్రహ్మాజీ కనిపించనున్నారు.
News November 22, 2025
క్షమాపణలు చెప్పిన అల్-ఫలాహ్ వర్సిటీ

ఢిల్లీ పేలుడు ఘటనలో అల్-ఫలాహ్ వర్సిటీ పేరు రావడంతో, వారి వెబ్సైట్లో ఉన్న పాత అక్రిడిటేషన్ వివరాలపై NAAC షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై వర్సిటీ స్పందిస్తూ వెబ్సైట్ డిజైన్ లోపాలు కారణంగా ఈ పొరపాట్లు జరిగాయని క్షమాపణలు తెలిపింది. తప్పుడు సమాచారాన్ని తొలగించినట్లు పేర్కొంది. కాగా గడువు ముగిసిన తరువాత కూడా వర్సిటీ గ్రేడ్లను తమ సైట్లో కొనసాగిస్తూ వచ్చింది.


