News December 28, 2024

ఉద్యోగులకు భరోసా ఇవ్వాలని పవన్‌కు వినతి

image

AP: అన్నమయ్య(D) గాలివీడు MPDO కార్యాలయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించారు. నిన్న జవహర్ బాబుపై దాడి ఘటనపై ఆరా తీశారు. ఈ సందర్భంగా విధుల్లో ఉన్న అధికారులు, ఉద్యోగులకు భరోసా ఇవ్వాలని ఎంపీడీవోల సంఘం ప్రతినిధులు పవన్‌ను కోరారు. ఉద్యోగులపై దాడులు చేస్తే తీవ్ర చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు.

Similar News

News January 22, 2026

హీరో విజయ్ TVK పార్టీకి విజిల్ గుర్తు కేటాయింపు

image

తమిళ హీరో విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీకి ఎన్నికల సంఘం విజిల్ గుర్తును కేటాయించింది. ఈమేరకు గురువారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. త్వరలో తమిళనాడు, పుదుచ్చేరి శాసనసభలకు జరగనున్న ఎన్నికల్లో ఆ పార్టీ ఈ గుర్తుపై పోటీచేయనుంది.

News January 22, 2026

ఈ ఫుడ్స్‌ తింటే పదేళ్లు యంగ్‌గా కనిపిస్తారు

image

చర్మానికి లోపలి నుంచి పోషణ అందిస్తే ఎక్కువ కాలం యంగ్‌గా కనిపించొచ్చని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు. ఉసిరికాయల్లో ఉండే కొల్లాజెన్ స్కిన్‌ను ముడతలు పడకుండా, సాగిపోకుండా కాపాడుతుంది. దానిమ్మగింజల్లోని యాంటీ ఆక్సిడెంట్లు స్కిన్ ప్రాబ్లమ్స్‌ను దూరం చేస్తాయి. వాల్‌నట్స్‌లో ఉండే విటమిన్ ఈ, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ స్కిన్‌ను యవ్వనంగా మారుస్తాయి. రోజూ 4-5 నానబెట్టిన బాదంపప్పులు తింటే చర్మం మెరుస్తుంది.

News January 22, 2026

గులాబీ తోటలను ఎలాంటి చీడపీడలు ఆశిస్తాయి?

image

శుభకార్యాలు, వ్యక్తిగత అవసరాల కారణంగా ప్రస్తుతం గులాబీ పూల వినియోగం బాగా పెరిగింది. మార్కెట్ డిమాండ్‌ బట్టి గులాబీ సాగుకు రైతులు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఈ పువ్వుల సాగులో చీడపీడల సమస్య రైతులకు ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా గులాబీ పంటకు పువ్వు, మొగ్గలు తొలిచేపురుగు.. ఆకులను తిని ,రంధ్రాలు చేసే పెంకు పురుగులు, గొంగళి పురుగులు, నల్ల మచ్చ తెగులు, కొమ్మ ఎండు, బూడిద తెగులు ఆశించి నష్టపరుస్తున్నాయి.