News April 2, 2024
రెండు ఐపీఎల్ మ్యాచ్‌ల రీ షెడ్యూల్

రెండు IPL మ్యాచ్‌లను BCCI రీ షెడ్యూల్ చేసింది. ఈ నెల 17న కోల్‌కతాలో జరగాల్సిన KKR, RR మ్యాచ్‌ను ఒక రోజు ముందుగా నిర్వహించనుంది. ఈ నెల 16న ఇది జరగనుంది. ఈ మ్యాచ్ ఒక రోజు ముందుకు జరగడంతో ఈ నెల 16న GT, DC మధ్య జరగాల్సిన మ్యాచ్ రీషెడ్యూల్ అయింది. దీనిని ఈ నెల 17న నిర్వహించనున్నారు. కాగా శ్రీరామ నవమి సందర్భంగా మ్యాచ్‌కు భద్రత కల్పించలేమని బెంగాల్ పోలీసులు తెలపడంతో BCCI మ్యాచ్ తేదీలు మార్చింది.
Similar News
News November 20, 2025
iBOMMA Oneపై పోలీసుల రియాక్షన్

iBOMMA One పైరసీ వెబ్‌సైట్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు స్పష్టత ఇచ్చారు. ఆ సైట్లో కొత్త సినిమాలు పైరసీ సినిమాలు లేవని తెలిపారు. సినిమాలకు సంబంధించిన రివ్యూలు మాత్రమే ఉన్నాయని, తెరవడానికి ప్రయత్నిస్తే కూడా సైట్ ఓపెన్ కాకపోగా, ఏ ఇతర పైరసీ సైట్లకు రీడైరెక్ట్ అవ్వడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికే iBOMMA, BAPPAM వంటి వెబ్సైట్లను బ్లాక్ చేసినట్లు చెప్పారు.
News November 20, 2025
పీఎం కిసాన్ డబ్బులు పడ్డాయా? ఇలా తెలుసుకోండి!

నిన్న ప్రధాని మోదీ పీఎం కిసాన్ 21వ విడత నిధులను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2వేల చొప్పున రూ.18వేల కోట్లు జమ చేశారు. భూమి వివరాలు PM-KISAN పోర్టల్‌లో నమోదై ఉండి, బ్యాంక్ అకౌంట్ ఆధార్‌తో లింక్ అయి ఉన్న రైతులకే ఈ స్కీమ్ ప్రయోజనాలు అందనున్నాయి. https://pmkisan.gov.in/లోకి వెళ్లి మీ ఖాతాలో డబ్బులు పడ్డాయో, లేదో తెలుసుకోవచ్చు.
News November 20, 2025
దేశవ్యాప్తంగా సన్న బియ్యం ఇవ్వాలని కేంద్ర మంత్రికి CM విజ్ఞప్తి

దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీకి CM రేవంత్ వివరించారు. HYDలో ఆయనతో సీఎం భేటీ అయ్యారు. ప్రజలు తినే బియ్యాన్ని సరఫరా చేస్తేనే సంక్షేమ పథకం ఉద్దేశం నెరవేరుతుందని, దేశవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ అంశాన్ని పరిశీలించాలని కోరారు. పూర్తిస్థాయి అధ్యయనం తర్వాత పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి తెలిపారు.


