News August 22, 2024
అచ్యుతాపురం సెజ్‌లో రెస్క్యూ అపరేషన్ పూర్తి

అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా ప్రమాద ఘటనలో సహాయక చర్యలు పూర్తయ్యాయి. సిబ్బంది శిథిలాలను పూర్తిగా తొలగించారు. భారీ అగ్నిమాపక యంత్రాల సాయంతో 33మందిని రక్షించారు. ఇప్పటికే 18మంది కన్నుమూయగా, ఆస్పత్రుల్లో పలువురు కార్మికులు చావుబతుకుల మధ్య పోరాడుతున్నారు. ఈ క్రమంలో మృతుల సంఖ్య పెరగొచ్చన్న ఆందోళనలు నెలకొన్నాయి.
Similar News
News November 27, 2025
భార్యను చంపిన కేసులో భర్తకి జీవిత ఖైదు: శ్రీకాకుళం ఎస్పీ

భార్యను చంపిన కేసులో భర్తకు కోర్టు జీవిత ఖైదు శిక్షను విధించినట్లు గురువారం శ్రీకాకుళం ఎస్పీ కె.విమహేశ్వరరెడ్డి తెలిపారు. 2018 మార్చి 14వ తేదీన పొందూరు మండలం బాణం గ్రామానికి చెందిన జీరు రమణమ్మను అనుమానంతో భర్త వెంకటరమణ కత్తితో దాడి చేసి హత్యచేశాడు. ఘటనపై ముద్దాయిపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. బెయిల్‌పై బయటకు వచ్చి పరారీలో ఉన్న అతడిని తాజాగా కోర్టులో హాజరుపరచగా జీవిత ఖైదు విధించారు.
News November 27, 2025
ధాన్యం కొనుగోళ్లపై వైసీపీ అబద్ధాలు: నాదెండ్ల

AP: రైతులకు నష్టం లేకుండా ధాన్యం కొంటున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 24 గంటల్లోనే ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని చెప్పారు. అయినా YCP నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ₹1,674 కోట్లు బకాయిలు పెట్టి పారిపోయిన వాళ్లా రైతుల పక్షాన మాట్లాడేదని మండిపడ్డారు. 8.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. దళారులను నమ్మి రైతులు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని కోరారు.
News November 27, 2025
పాక్ న్యూక్లియర్ కంట్రోల్స్ ఆసిమ్ మునీర్ చేతికి!

పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఆ దేశ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్(CDF)గా బాధ్యతలు చేపట్టారు. అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌కు అతను అధిపతిగా ఉంటారు. ఆ దేశ ప్రధానికి సరిసమానమైన పవర్స్ మాత్రమే కాదు లీగల్ ప్రొటెక్షన్ కూడా ఆసిమ్ మునీర్‌కు ఉంటుందని చెబుతున్నారు. అతనికి కేసుల నుంచి లైఫ్ టైమ్ ఇమ్యూనిటీతో పాటు న్యూక్లియర్ వెపన్స్ కంట్రోల్స్ కూడా అతని చేతికే ఇస్తారని తెలుస్తోంది.


