News February 24, 2025

50 గంటలుగా కొనసాగుతున్న సహాయక చర్యలు

image

TG: SLBC టన్నెల్ ఘటనలో 8 మంది చిక్కుకొని 50 గంటలు దాటింది. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బురద పెద్ద ఎత్తున పేరుకుపోవడంతో రెస్క్యూ చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. బురదలో ఉన్న వ్యక్తులను గుర్తించే అత్యాధునిక పరికరాలతో గాలిస్తున్నారు. టన్నెల్ బోరింగ్ మిషన్‌లో సేఫ్ కంటైనర్‌లోకి కార్మికులు వెళ్లుంటే ప్రాణాలతో ఉండే అవకాశం ఉందని రెస్క్యూ సిబ్బంది చెబుతున్నారు.

Similar News

News December 5, 2025

ఈశ్వర్ కుటుంబానికి రూ.50లక్షలు ఇవ్వాలి: హరీశ్ రావు

image

TG: బీసీ రిజర్వేషన్ల పేరిట సీఎం రేవంత్ ఆడిన రాక్షస రాజకీయ క్రీడలో <<18478689>>సాయి ఈశ్వర్<<>> బలైపోవడం తీవ్రంగా కలిచివేసిందని హరీశ్‌రావు చెప్పారు. బీసీ బిడ్డ ఆత్మబలిదానానికి కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీ సమాజం ఎప్పటికీ క్షమించదన్నారు. ‘ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యే. బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలి’ అని సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు.

News December 5, 2025

CM రేవంత్‌కు సోనియా అభినందన సందేశం

image

TG: తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్-2047 నాటికి రాష్ట్రం $1T ఆర్థికశక్తిగా ఎదగడంలో కీల‌కం కానుందని INC పార్ల‌మెంట‌రీ పార్టీ నేత సోనియా గాంధీ పేర్కొన్నారు. స‌మ్మిట్ నిర్వ‌హిస్తున్నందుకు CM రేవంత్ రెడ్డికి అభినంద‌న‌లు తెలిపారు. సీఎం చేస్తున్న కృషి విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కీల‌క‌ ప్రాజెక్టులు, ప్రణాళికల్లో భాగ‌మయ్యే వారికి స‌మ్మిట్ మంచి వేదిక అని తన సందేశంలో పేర్కొన్నారు.

News December 5, 2025

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌.. సీఎంలకు మంత్రుల ఆహ్వానం

image

TG: ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2047కు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా వ్యాపారవేత్తలతో పాటు పలు రాష్ట్రాల CMలకూ మంత్రులు ఆహ్వానం పలుకుతున్నారు. ఇవాళ AP CM చంద్రబాబును కోమటిరెడ్డి, TN CM స్టాలిన్‌ను ఉత్తమ్, ఝార్ఖండ్ CM హేమంత్‌ను భట్టి ఆహ్వానించారు. ‘CBN సీనియర్ నాయకుడు. ఆయన సలహా తీసుకుంటాం. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడాలి’ అని కోమటిరెడ్డి చెప్పారు.