News March 29, 2024

రైతులకూ రిజర్వేషన్లు కల్పించాలి: జస్టిస్ ఎన్వీ రమణ

image

AP: దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతకు గుర్తింపు దక్కడం లేదని మాజీ CJI జస్టిస్ NV రమణ ఆవేదన వ్యక్తం చేశారు. పారిశ్రామికీకరణ పెరిగి వ్యవసాయం అంటరాని వృత్తిగా మారిపోయిందన్నారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘రైతులు, రైతు కూలీలకు న్యాయం జరగాలంటే వారికి అన్ని శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. లేదంటే సంపన్నుల ఆధిపత్యంలోనే వ్యవస్థలు ఉండిపోయి కర్షకులకు న్యాయం జరగదు’ అని అభిప్రాయపడ్డారు.

Similar News

News April 3, 2026

టాప్ సెల్లింగ్ కార్లలో మారుతీ డామినేషన్!

image

2025-26 ఆర్థిక సంవత్సరం టాప్ 10 సెల్లింగ్ కార్ల జాబితాలో మారుతీ సుజుకీ జోరు ప్రదర్శించింది. ఈ లిస్ట్‌లో ఆరు కార్లు మారుతీ సుజుకీకి చెందినవే ఉన్నాయి. తొలిస్థానంలో 2,29,130 యూనిట్ల సేల్స్‌తో డిజైర్ నిలవగా.. నాలుగో స్థానంలో ఎర్టిగా (1,98,876), ఐదో స్థానంలో సుజుకీ స్విఫ్ట్ (1,85,349), ఏడో స్థానంలో వ్యాగన్-ఆర్ (1,80,134), ఎనిమిదో స్థానంలో బ్రీజా (1,80,104), పదో స్థానంలో బలేనో (1,72,560) నిలిచాయి.

News April 3, 2026

మెగాస్టార్ 158 మూవీ ఆ రోజే ప్రారంభం?

image

మెగాస్టార్ చిరంజీవి – దర్శకుడు బాబీ కాంబినేషన్‌లోని ‘మెగా 158’ ప్రాజెక్టు ఈనెల 11న లాంచ్ కానున్నట్లు సమాచారం. ఏప్రిల్ 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని.. దీని కోసం చిత్ర యూనిట్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ‘వాల్తేర్ వీరయ్య’ హిట్ తర్వాత మరోసారి ఈ చిరు-బాబీ కాంబోలో మూవీ రానుండటంతో దీనిపై అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించనున్నారు.

News April 3, 2026

రాష్ట్రంలో 87 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్ల పునర్విభజన

image

AP: రాష్ట్రంలో 87 మున్సిపాలిటీలు, 13 మున్సిపల్ కార్పొరేషన్ల పునర్విభజనకు ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ డీలిమిటేషన్ జరిగింది. ఈ మార్పులతో వార్డుల సంఖ్య విశాఖలో 98 నుంచి 120కి, విజయవాడలో 64 నుంచి 86కు, గుంటూరులో 57 నుంచి 76కు, నెల్లూరులో 54 నుంచి 72కి, కర్నూల్‌లో 52 నుంచి 68కి, తిరుపతిలో 50 నుంచి 66కు, అనంతపురంలో 50 నుంచి 62కు పెరిగాయి.