News January 30, 2025
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు.. మంత్రి కీలక వ్యాఖ్యలు

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. రిజర్వేషన్లపై కమిషన్, క్యాబినెట్ చర్చించినట్లు తెలిపారు. 3 రోజుల్లో విధివిధానాలు ఖరారు చేస్తామన్నారు. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తవ్వగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
Similar News
News December 30, 2025
CETs తేదీలు ఖరారు.. చెక్ చేసుకోండి

తెలంగాణలో ఉన్నత విద్య కోర్సుల ఎంట్రన్స్ ఎగ్జామ్స్ డేట్స్ వెల్లడయ్యాయి. ఇంజినీరింగ్, ఫార్మా అనుబంధ కోర్సుల అడ్మిషన్లకు గల EAPCET 2026 మే 4- 11 తేదీల మధ్య ఉంటుందని ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఇక MBA/MCA ప్రవేశాల కోసం ICETను మే 13, 14 తేదీల్లో B.Ed ఎంట్రన్స్ టెస్ట్ EDCETను మే 12న నిర్వహిస్తామని తెలిపింది. మిగతా పరీక్షల షెడ్యూల్, నిర్వహించే యూనివర్సిటీల వివరాలు పై ఫొటోలో వివరంగా పొందండి.
Share It
News December 30, 2025
మోహన్‌లాల్ తల్లి కన్నుమూత

మలయాళం సూపర్‌స్టార్ మోహన్‌లాల్ తల్లి శాంతాకుమారి(90) కన్నుమూశారు. కేరళలోని కొచ్చిలో ఆమె తుదిశ్వాస విడిచారు. శాంతాకుమారి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. మోహన్‌లాల్‌కు సానుభూతి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
News December 30, 2025
సర్వికల్ క్యాన్సర్ లక్షణాలివే..

గర్భాశయ క్యాన్సర్ సాధారణంగా మానవ పాపిల్లోమావైరస్ (HPV) వల్ల వస్తుంది. యోని రక్తస్రావం, యోనిలో మార్పులు, సెక్స్ సమయంలో నొప్పి, తుంటి భాగంలో నొప్పి వస్తుంటే అవి సర్వికల్ క్యాన్సర్ లక్షణాలు కావొచ్చు. ఈ లక్షణాలుంటే పాప్ స్మెర్మ్, HPV పరీక్షలు చేయించుకోవాలి. HPV అట్-హోమ్ సెల్ఫ్-టెస్టింగ్ కిట్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. 25 ఏళ్లు పైబడిన మహిళలు ఈ టెస్టులు చేయించుకోవడం మంచిది.


