News July 25, 2024
వాట్సాప్‌లో ‘రీషేర్ స్టేటస్ అప్డేట్స్’ ఫీచర్

వాట్సాప్ స్టేటస్‌లలో కాంటాక్ట్స్‌లోని వారిని మెన్షన్ చేసే <<13005099>>ఫీచర్<<>> త్వరలో రానుంది. దీనికి అనుబంధంగా ‘రీషేర్ స్టేటస్ అప్డేట్స్’ అనే మరో ఆప్షన్‌ను తీసుకొస్తున్నట్లు వాబీటా ఇన్ఫో వెల్లడించింది. ఇందులో భాగంగా యూజర్లు ఇతరుల స్టేటస్‌లను డైరెక్ట్‌గా తమ స్టేటస్‌గా పెట్టుకోవచ్చు. దీనికోసం స్క్రీన్ షాట్ తీయడం లేదా వారిని పంపమని అడగాల్సిన అవసరం ఉండదు. వారు మిమ్మల్ని తమ స్టేటస్‌లో మెన్షన్ చేస్తే సరిపోతుంది.
Similar News
News December 21, 2025
అన్ని లారీలకు ట్రాకింగ్ పరికరం తప్పనిసరి

AP: రాష్ట్రంలోని అన్ని లారీలకు వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్ (VLTD) తప్పనిసరిగా అమర్చాలని ఏపీ లారీ యజమానుల సంఘం పిలుపునిచ్చింది. ఇప్పటికే అమర్చిన పరికరాలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో యజమానులు పరిశీలించాలని సూచించింది. జనవరి 1 నుంచి VLTD లేకపోయినా, పనిచేయకపోయినా రవాణా శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ(MoRTH) ఆదేశించినట్లు తెలిపింది.
News December 21, 2025
ఉత్కంఠ.. బిగ్‌బాస్ విజేత ఎవరు?

తెలుగు బిగ్‌బాస్-9 విజేతను హోస్ట్ నాగార్జున ఇవాళ రాత్రి ప్రకటించనున్నారు. దీంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. టాప్-5 కంటెస్టెంట్లుగా కళ్యాణ్, తనూజ, డిమోన్ పవన్, ఇమ్మాన్యుయేల్, సంజన ఉన్నారు. సోషల్ మీడియా బజ్ ప్రకారం కళ్యాణ్, తనూజలో ఒకరు విన్నర్ అవుతారని తెలుస్తోంది. తొలుత సంజన, తర్వాత ఇమ్మాన్యుయేల్, డిమోన్ ఎలిమినేట్ అవుతారని సమాచారం. విజేత ఎవరని మీరనుకుంటున్నారో కామెంట్ చేయండి.
News December 21, 2025
ఇకపై ‘మనమిత్ర’లోనే ఆర్జిత సేవా టికెట్లు

AP: విజయవాడ కనకదుర్గమ్మ భక్తులకు దేవస్థానం శుభవార్త చెప్పింది. ఇకపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలోని అన్ని ఆర్జిత సేవల టికెట్లు మనమిత్ర వాట్సాప్ నంబర్ ద్వారానే లభ్యమవుతాయని అధికారులు తెలిపారు. కౌంటర్ల వద్ద టికెట్ల విక్రయం పూర్తిగా నిలిపివేయనున్నట్లు స్పష్టం చేశారు. ప్రత్యక్ష, పరోక్ష సేవల టికెట్లను 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా బుక్ చేసుకోవచ్చని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.


