News January 29, 2025
రెసిడెన్స్ బేస్డ్ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: SC

PG మెడికల్ కోర్సుల్లో రెసిడెన్స్ బేస్డ్ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర కోటా కింద PG సీట్ల కేటాయింపు ఆర్టికల్ 14కు వ్యతిరేకమని పేర్కొంటూ ఈ విధానాన్ని రద్దు చేసింది. నీట్ పరీక్షలో మెరిట్ ఆధారంగానే ఈ సీట్లను భర్తీ చేయాలని స్పష్టం చేసింది. ఇదివరకే అమలు చేసిన నివాస ఆధారిత రిజర్వేషన్ల విషయంలో తాజా తీర్పు ఎలాంటి ప్రభావం చూపబోదని పేర్కొంది.
Similar News
News November 21, 2025
మాజీ మంత్రి శైలజానాథ్కు మాతృవియోగం

శింగనమల వైసీపీ ఇన్ఛార్జి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ తల్లి సాకే గంగమ్మ మృతి చెందారు. అనంతపురంలోని రామకృష్ణ నగర్లో నివాసం ఉంటున్న ఆమె శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. తల్లి మృతితో శైలజానాథ్ కుటుంబంలో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు శైలజానాథ్ను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
News November 21, 2025
మరో తుఫాను ‘సెన్యార్’!

రేపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం బలపడి తుఫానుగా మారే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. ఈ తుఫానుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సూచించిన ‘సెన్యార్’ పేరును IMD పెట్టనున్నట్లు సమాచారం. సెన్యార్ అంటే ‘లయన్’ అని అర్థం. తుఫాను ప్రభావంతో 24వ తేదీ నుంచి తమిళనాడులో, 26-29వరకు ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలకు ఛాన్స్ ఉంది. ఇటీవల ‘మొంథా’ తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే.
News November 21, 2025
కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్ పేపర్ 2 పరీక్ష ఎప్పుడంటే?

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) 552 కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్టులకు సంబంధించి పేపర్ 2 పరీక్ష షెడ్యూల్ను ప్రకటించింది. డిసెంబర్ 14న డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. ఆగస్టు 12న నిర్వహించిన పేపర్ 1 పరీక్షను 6,332 మంది రాయగా.. పేపర్ 2కు 3,642మంది అర్హత సాధించారు.


