News November 7, 2024
HYDలో రెసిడెన్షియల్ సేల్స్ పెరుగుదల: స్క్వేర్ యార్డ్స్
2024 జులై-సెప్టెంబర్‌లో HYDలో రెసిడెన్షియల్ సేల్స్ 20%, లావాదేవీలు 7% పెరిగాయని స్క్వేర్ యార్డ్స్ సంస్థ తెలిపింది. గత ఏడాది జులై-సెప్టెంబర్(18,314)తో పోలిస్తే ఈ ఏడాది(19,527) ట్రాన్సక్షన్స్‌లో పెరుగుదల కనిపించిందని పేర్కొంది. మొత్తం రిజిస్టర్డ్ సేల్స్ విలువ ₹11,718కోట్లకు చేరిందని తెలిపింది. యావరేజ్ రిజిస్టర్డ్ హోమ్ సేల్స్ వాల్యూ ₹60లక్షలుగా ఉందని, వార్షిక వృద్ధి 13%గా నమోదయిందని వివరించింది.
Similar News
News November 7, 2024
చికెన్ తిని యువతి మృతి.. వెలుగులోకి కొత్త విషయం
TG: నిర్మల్‌లోని గ్రిల్9 రెస్టారెంట్లో చికెన్ బిర్యానీ తిని యువతి <<14537109>>మరణించిన<<>> ఘటనలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. చికెన్ ఐటమ్స్‌పై మయోనైజ్ వేసుకుని తినడం వల్లే యువతి మరణించిందని, పదుల సంఖ్యలో ఆస్పత్రిపాలయ్యారని అధికారులు తెలిపారు. ఇవాళ ఆ రెస్టారెంట్‌ను సీజ్ చేశారు. కాగా TGలో మయోనైజ్‌ను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అయినా కొన్ని రెస్టారెంట్లలో దీన్ని వాడుతుండటం గమనార్హం.
News November 7, 2024
ఎల్లుండి సా.4:30 గంటలకు ‘గేమ్ ఛేంజర్’ టీజర్
‘గేమ్ ఛేంజర్’ సినిమా టీజర్‌ను ఈనెల 9న సా.4:30కు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. లక్నోలోని ప్రతిభ థియేటర్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని థియేటర్లలో టీజర్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో సుదర్శన్, తిరుపతిలో PGR, విజయవాడలో శైలజ, బెంగళూరులో ఊర్వశితో పాటు మరో 5 థియేటర్ల పేర్లను ప్రకటించారు. శంకర్ డైరెక్షన్లో రామ్‌చరణ్ నటించిన ఈ మూవీ 2025 జనవరి 10న రిలీజ్ కానుంది.
News November 7, 2024
BRS, కాంగ్రెస్‌ను ఖతం చేస్తాం: కిషన్‌రెడ్డి
TG: రాష్ట్రంలో BRS, కాంగ్రెస్‌ను ఖతం చేస్తామని BJP నేత, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందన్నారు. కేటీఆర్ వైఖరి వల్ల BRS పైనా వ్యతిరేకత పోలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన కులగణనను తాము తప్పుబట్టడం లేదని ఆయన తెలిపారు. మూసీ నది పునరుజ్జీవం కోసం ఇళ్లు కూల్చవద్దని, నదికి రక్షణ గోడ నిర్మించాలని సూచించారు.