News October 6, 2024
స్వర్ణయుగంలోకి రెసిడెన్షియల్ స్కూల్స్: భట్టి

TG: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌తో రాష్ట్రంలోని రెసిడెన్షియల్ స్కూల్స్ స్వర్ణయుగంలోకి ప్రవేశిస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రూ.5వేల కోట్లతో ఈ సంవత్సరం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ స్కూల్స్ నిర్మాణం ప్రారంభిస్తామన్నారు. దసరా ముందు రోజు రాష్ట్ర వ్యాప్తంగా పనులకు భూమి పూజ చేస్తామని తెలిపారు. భవనాల డిజైన్‌లకు సంబంధించిన ఫొటోలను ఆయన Xలో పంచుకున్నారు.
Similar News
News March 5, 2025
నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఆయన అక్కడ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు. ఇవాళ రాత్రి తిరిగి వైజాగ్ చేరుకుంటారు. రేపు ఉదయం తన తోడల్లుడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ సభలో పాల్గొంటారు. మళ్లీ 6వ తేదీ మధ్యాహ్నం ఢిల్లీ వెళ్తారు. 7న ఢిల్లీ నుంచి తిరిగి అమరావతి చేరుకుంటారు.
News March 5, 2025
ఒకటో తేదీనే మిడ్ డే మీల్ బిల్లులు

TG: స్కూళ్లలో మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి ప్రతినెలా ఒకటో తేదీనే బిల్లులు చెల్లించేందుకు కసరత్తు చేస్తోంది. తొలుత పెద్దపల్లి, కొత్తగూడెం జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. ప్రతినెలా ఎంత మంది విద్యార్థులు భోజనం చేశారో MDM యాప్‌లో నమోదు చేయగానే బిల్లు జనరేట్ అయ్యేలా మార్పులు చేయనుంది. బిల్లుకు HM, MEO ఆమోదం తెలపగానే ఖాతాల్లో బిల్లు మొత్తం జమ అవుతుంది.
News March 5, 2025
నేడు SAvsNZ: ఫైనల్‌లో భారత్‌ను ఢీకొట్టేదెవరు?

ఛాంపియన్స్ ట్రోఫీ రెండో సెమీ ఫైనల్‌లో ఇవాళ సౌతాఫ్రికా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. రెండు జట్లూ సమతూకంగా ఉండటంతో పోటీ ఆసక్తికరంగా ఉండనుంది. మ.2.30కు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐసీసీ టోర్నీల్లో చివరి మెట్టులో బోల్తా పడే వీక్‌నెస్‌ను అధిగమించాలని ఈ టీమ్‌లు ఆరాటపడుతున్నాయి. నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం భారత్‌ను ఢీకొట్టనుంది. ఇవాళ ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.