News October 27, 2024
మూసీ నిర్వాసితులకు రెసిడెన్షియల్ టవర్స్: భట్టి

TG: మూసీ నిర్వాసితుల కోసం నదికి సమీపంలోనే రెసిడిన్షియల్ టవర్స్ నిర్మిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. హైటెక్ సిటీలో నిర్వహించిన ఓ ప్రాపర్టీ షోలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టవర్లలో అన్ని సౌకర్యాలు ఉంటాయని పేర్కొన్నారు. మూసీ నది నిర్వాసితులకు పాఠశాలలు, మహిళా స్వయం సహాయక సంఘాలు, చిన్న తరహా వ్యాపార అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు.
Similar News
News November 26, 2025
నా భవిష్యత్తుపై బీసీసీఐదే నిర్ణయం: గంభీర్

సౌతాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్ ఓటమి అనంతరం IND హెడ్ కోచ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన భవిష్యత్తుపై BCCI నిర్ణయం తీసుకుంటుందన్నారు. ‘నేను పదవిలో కొనసాగడానికి అర్హత ఉందా లేదా అనేది బోర్డు డిసైడ్ చేస్తుంది. భారత క్రికెట్ మాత్రమే ముఖ్యం. నేను కాదు’ అని పేర్కొన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ గెలిచినప్పుడూ తానే కోచ్‌గా ఉన్నానని గుర్తు చేశారు. తాజా ఓటమికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నారు.
News November 26, 2025
HOCLలో 72 పోస్టులు.. అప్లై చేశారా?

కేరళలోని హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్ లిమిటెడ్(<
News November 26, 2025
SBI సరికొత్త రికార్డు.. షేర్ వాల్యూ@రూ.999

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు SBI సరికొత్త రికార్డు నమోదుచేసింది. ఇవాళ సంస్థ స్టాక్ దాదాపు 3 శాతం పెరగడంతో విలువ ఆల్‌టైమ్ హై రూ.999కి చేరింది. స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.1000 కూడా దాటొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా సంస్థ వ్యాపార విలువ రూ.100 లక్షల కోట్లకు చేరినట్లు ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.


