News November 1, 2024
NPCIకి రాజీనామా.. MCX ఎండీగా ప్రవీణా రాయ్
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా COO ప్రవీణా రాయ్ తన పదవికి రాజీనామా చేశారు. వెంటనే మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్(MCX) MD, CEOగా బాధ్యతలు చేపట్టారు. ఈమె నియామకానికి ‘సెబీ’ ఆగస్టులోనే ఆమోదం తెలిపింది. ఫైనాన్షియల్ సెక్టార్లో ఆమెకు 30ఏళ్ల అనుభవం ఉంది. కోటక్ మహీంద్రా, సిటీ బ్యాంక్, HSBC బ్యాంకుల్లో పని చేశారు. NPCIలో బిజినెస్ స్ట్రాటజీ, మార్కెటింగ్ తదితర విభాగాలను పర్యవేక్షించారు.
Similar News
News November 1, 2024
IPL రిటెన్షన్: టీమ్‌ల వారీగా జాబితాలు ఇవే(PHOTOS)
IPL-2025కు ముందు కీలకమైన రిటెన్షన్ ప్రక్రియ ముగిసింది. పది జట్లు తాము అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. స్టార్ ప్లేయర్లను వదులుకున్న కొన్ని టీమ్‌ల నిర్ణయాలు ఆశ్చర్యం కలిగించగా, మరికొన్ని యంగ్ టాలెంట్‌కు పట్టం కట్టాయి. రిటెన్షన్‌లో నిలిచిన ప్లేయర్లను టీమ్‌ల వారీగా పైన ఫొటోల్లో చూడవచ్చు. త్వరలోనే జరిగే మెగా వేలం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
News November 1, 2024
హిందువులపై దాడిని ఖండిస్తున్నా: ట్రంప్
అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను కమలా, బైడెన్లు విస్మరించారని డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. బంగ్లాదేశ్‌లో ఇటీవల హిందువులు, ఇతర మైనారిటీలపై జరిగిన దాడిని తాను ఖండిస్తున్నానని చెప్పారు. తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే రాడికల్ లెఫ్ట్ నుంచి ఎదురవుతున్న మత వ్యతిరేక ఎజెండా నుంచి హిందూ అమెరికన్లకు రక్షణ కల్పిస్తామన్నారు. ఇండియాతో బలమైన భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.
News November 1, 2024
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
APలోని మన్యం, కృష్ణా, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇవాళ తేలికపాటి వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. TGలోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల,కరీంనగర్, భూపాలపల్లి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో వానలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.