News August 29, 2024
వైసీపీకి రాజీనామా చేస్తున్నా: ఎంపీ ప్రకటన

AP: YS కుటుంబంతో అత్యంత దగ్గరి సంబంధం ఉన్న తాను YCPకి రాజీనామా చేస్తున్నట్లు MP మోపిదేవి వెంకటరమణ వెల్లడించారు. ‘నా రాజీనామా వెనుక చాలా బలమైన కారణాలు ఉన్నాయి. అన్నీ బయటకు చెప్పుకోలేను. ప్రస్తుతానికి నేను, బీదమస్తాన్‌రావు రాజీనామా చేస్తున్నాం. ఈ నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకున్నది కాదు. మొన్న <<13958618>>టికెట్ <<>>ఇవ్వనప్పుడే మనస్తాపం చెందా. పార్టీకి ద్రోహం చేయకూడదనే అప్పుడు రాజీనామా చేయలేదు’ అని ఆయన చెప్పారు.
Similar News
News October 23, 2025
ఆకుకూరల్లో చీడపీడల నివారణకు సూచనలు

ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ఆకుకూరల పంటల్లో అనేక చీడపీడలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆకుల అడుగు బాగాన తెల్లని బొడిపెలు, పైభాగాన లేత పసుపు రంగు మచ్చలు ఏర్పడి పండు బారుతున్నాయి. వీటి నివారణకు లీటరు నీటికి కాపర్ఆక్సీక్లోరైడ్ మూడు గ్రాముల మందును కలిపి ఆకుల అడుగు భాగం తడిసేలా పిచికారీ చేయాలి. గొంగళి పురుగులు ఆకులను కొరికి తింటుంటే లీటరు నీటికి కార్బరిల్ మందును రెండు గ్రాములు కలిపి పిచికారీ చేయాలి.
News October 23, 2025
నేడు అన్నాచెల్లెళ్ల పండుగ.. మీరు చేస్తున్నారా?

రాఖీ లాగే కార్తీక శుక్ల పక్ష విదియ నాడు ‘భాయ్‌దూజ్’ పేరిట అన్నాచెల్లెళ్ల పండుగ నిర్వహిస్తారు. ఈ శుభదినాన యమునా దేవి తన సోదరుడు యముడికి ఆప్యాయంగా భోజనం పెట్టి, ఆయనకు అపమృత్యు భయం లేకుండా దీవించిందట. అందుకే సోదరీమణులు ఈ పర్వదినాన తమ సోదరులను ఇంటికి పిలిచి కడుపు నిండా భోజనం పెడతారు. సోదరుడు, సోదరి చేతి భోజనం తింటే దీర్ఘాయుష్షు కలుగుతుందని నమ్ముతారు. మీరు ఈ పండుగ చేస్తున్నారా? COMMENT
News October 23, 2025
ప్రద్యుమ్న ఫిర్యాదుపై మాగంటి సునీత ఏమన్నారంటే?

TG: ఈసీకి ప్రద్యుమ్న <<18073070>>ఫిర్యాదు<<>> చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత స్పందించారు. ఆయన ఆరోపణలు తప్పని తేల్చిచెప్పారు. తనపై కొందరు అనవసర ఆరోపణలు చేస్తున్నారని, వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు పేర్కొన్నారు. అటు నవీన్ యాదవ్ నామినేషన్‌లో కొన్ని ఖాళీలు ఉండటంపై ఫిర్యాదు చేసినట్లు BRS నేతలు వెల్లడించారు. చట్టప్రకారం పత్రాలలో ఎలాంటి ఖాళీలు ఉండకూడదని పేర్కొన్నారు.