News March 20, 2025

బుడగజంగం కులాన్ని ఎస్సీల్లో చేర్చాలని తీర్మానం

image

AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బుడగజంగం కులాన్ని ఎస్సీల్లో చేర్చాలంటూ శాసనసభలో తీర్మానం చేసింది. దీనికి సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అసెంబ్లీ తీర్మానాన్ని ప్రభుత్వం త్వరలోనే కేంద్రానికి పంపనుంది.

Similar News

News January 10, 2026

ప్రయాణాల్లో వాంతులవుతున్నాయా?

image

ప్ర‌యాణాల్లో వాంతులు అవ‌డం అనేది సాధార‌ణంగా చాలా మంది ఎదుర్కొనే స‌మ‌స్య. వికారంగా అనిపించ‌డం, త‌ల తిర‌గ‌డం, పొట్ట‌లో అసౌకర్యంగా ఉండడం ఇవ‌న్నీ మోష‌న్ సిక్‌నెస్ ల‌క్ష‌ణాలు. దీన్ని తగ్గించాలంటే అల్లం రసం, హెర్బల్ టీ వంటివి తాగాలి. శ్వాస వ్యాయామాలు చేయాలి. నిమ్మకాయ వాసన చూసినా వికారం తగ్గుతుంది. అలాగే ప్రయాణానికి ముందు తేలిగ్గా జీర్ణ‌మ‌య్యే ఆహారం తీసుకోవాలి. హెవీ ఫుడ్స్‌ సమస్యను మరింత పెంచుతాయి.

News January 10, 2026

తిరుమల శ్రీవారికి ఆయుధాలు లేవా?

image

తిరుమల శ్రీవారు ఆయుధాలు లేకుండా దర్శనమిస్తారు. దీనికొక పురాణ గాథ ఉంది. పూర్వం సింహాద అనే రాక్షసుడిని సంహరించడానికి శ్రీనివాసుడు తన శంఖుచక్రాలను తొండమాన్ చక్రవర్తికి ఇచ్చారు. ఆయన ఆయుధాలు లేకుండానే స్వామివారు భక్తులకు దర్శనమివ్వాలని కోరారు. భక్తుడి కోరిక మేరకే మూలవిరాట్టుకు ఆయుధాలు ఉండవు. ప్రస్తుతం ఉన్న శంఖుచక్రాలు భక్తులు సమర్పించిన ఆభరణాలు. అసలు ఆయుధాలు తిరుమలలోని వివిధ తీర్థాలుగా వెలిశాయి.

News January 10, 2026

సంక్రాంతి వేళ బస్సుల్లో ఛార్జీలు పెంచారా.. ఈ నంబర్ గుర్తుంచుకోండి!

image

AP: సంక్రాంతి నేపథ్యంలో కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు విపరీతంగా ఛార్జీలు పెంచినట్లు ఫిర్యాదులు రావడంతో రవాణాశాఖ చర్యలకు ఉపక్రమించింది. ఆర్టీసీ ఛార్జీల కంటే 50% మించి వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ట్రావెల్స్‌పై ఫిర్యాదుకు చేసేందుకు టోల్ ఫ్రీ నంబరు(92816 07001)ను సంప్రదించాలంది. 18వ తేదీ వరకు ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు చేస్తామని పేర్కొంది.