News November 16, 2024
‘మేడిన్ ఇండియా’కు రెస్పెక్ట్ పెరిగింది: వేదాంత ఫౌండర్
భారత్‌కు, భారతీయులకు, భారతీయ ఉత్పత్తులకు ప్రపంచంలో అత్యధిక డిమాండ్ ఏర్పడిందని వేదాంత ఫౌండర్ అనిల్ అగర్వాల్ అన్నారు. మన దేశం ఈ పరిస్థితికి చేరిన విధానం ఇతర దేశాలు అనుసరించేందుకు ఒక మోడల్‌గా మారిందన్నారు. భారతీయ ప్రతిభావంతులకు ఉద్యోగాలిచ్చేందుకు కంపెనీలు వెంటపడుతున్నాయని తెలిపారు. ‘మేడిన్ ఇండియా’ లేబుల్‌కు ఇప్పుడు గౌరవం పెరిగిందని, దేశంలో అవకాశాలను పెంచిందని HTLS 2024లో వెల్లడించారు.
Similar News
News November 16, 2024
BSNL: 2 నెలల్లో 65 లక్షల మంది కొత్త యూజర్లు
ప్రభుత్వ రంగ టెలికం ప్రొవైడర్ BSNL ఊపందుకుంటోంది. DOT ప్రకారం గత 2 నెలల్లోనే 65 లక్షల మంది కొత్త యూజర్లను పొందింది. ప్రైవేట్ ప్రొవైడర్లు విపరీతంగా రీఛార్జ్ ధరలు పెంచడంతో AIRTEL, JIO యూజర్లు BSNLలో చేరుతున్నట్లు DOT తెలిపింది. ఇదే సమయంలో జియో, ఎయిర్టెల్ కంపెనీలు 40 లక్షల యూజర్లను కోల్పోయాయి. కాగా, మెరుగైన కనెక్టివిటీ అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని కేంద్ర మంత్రి సింధియా తెలిపారు.
News November 16, 2024
25 ఏళ్ల తర్వాత సీనియర్ సిటిజన్స్ కోసం..
కేంద్రం 25 ఏళ్ల తర్వాత తొలిసారి సీనియర్ సిటిజన్స్ పాలసీని రూపొందిస్తున్నట్టు సమాచారం. భవిష్యత్తు అవసరాలకు తగినట్టు SR సిటిజన్స్ చట్టాన్నీ సవరిస్తుందని తెలిసింది. ఇందుకోసం TaskForce నియమించింది. ప్రస్తుతం 15.6 కోట్లుగా ఉన్న వృద్ధ జనాభా 2050 నాటికి 34.6 కోట్లకు పెరుగుతుందని అంచనా. దీంతో సంస్కరణల అవసరం ఏర్పడింది. పట్టణాల్లో 26.7% వృద్ధులు భాగస్వామితో కలిసి పిల్లలకు దూరంగా బతుకుతున్నారని LASI అంచనా.
News November 16, 2024
T20 సిరీస్ ఆసీస్ కైవసం
పాకిస్థాన్‌తో జరుగుతున్న 3 టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. రెండో టీ20లో ఆసీస్ 13 రన్స్ తేడాతో నెగ్గింది. ఆస్ట్రేలియా తొలుత 20 ఓవర్లలో 147/9 పరుగులు చేసింది. ఛేదనలో పాక్ 19.4 ఓవర్లు ఆడి 134 పరుగులకే ఆలౌటైంది. ఉస్మాన్ ఖాన్ (52) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. స్పెన్సర్ జాన్సన్ 5 వికెట్లతో చెలరేగారు. నామమాత్రపు చివరి టీ20 ఎల్లుండి హోబర్ట్‌లో జరుగుతుంది.