News June 15, 2024

‘స్పందన’ వ్యవస్థ పేరు మార్పు

image

AP: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల స్వీకరణకు తీసుకొచ్చిన ‘స్పందన’ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్పందన పేరు తొలగించి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థగా కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ పేరుతో ఫిర్యాదులు స్వీకరించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంది.

Similar News

News December 26, 2024

అంబటి రాంబాబు సంచలన ట్వీట్

image

AP: వంగవీటి మోహన రంగా వర్ధంతి రోజున మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన ట్వీట్ చేశారు. ‘దీక్షలో ఉన్న ధీరుడిని టీడీపీ గూండాలు హతమార్చి నేటికి 36 సంవత్సరాలు. జోహార్ వంగవీటి మోహన రంగా’ అని Xలో పేర్కొన్నారు. కాగా 1988లో బెజవాడలో జరిగిన అల్లర్లలో మోహన రంగాను ప్రత్యర్థులు హతమార్చారు.

News December 26, 2024

మంత్రులు, అధికారులతో సీఎం సమావేశం

image

సినీ ప్రముఖులతో భేటీకి ముందు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, అధికారులతో సమావేశం అయ్యారు. సినీ పరిశ్రమ ప్రతిపాదనలు, ప్రభుత్వ ఆలోచనలపై చర్చించారు. ఈ సమావేశం అనంతరం పోలీస్ కమాండ్ సెంటర్ (CCC)లో నిర్మాతలు, దర్శకులు, నటులతో సీఎం భేటీ కానున్నారు.

News December 26, 2024

బాక్సింగ్ డే: ముగ్గురు బ్యాటర్లు అర్ధసెంచరీలు

image

టీమ్ ఇండియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా ప్లేయర్లు అదరగొడుతున్నారు. ఓపెనర్లు కోన్ట్సస్(60), ఖవాజా(57) అర్ధసెంచరీలతో రాణించారు. టీ విరామం తర్వాత లబుషేన్(61*) కూడా అర్ధసెంచరీ పూర్తి చేశారు. మరో బ్యాటర్ స్మిత్(30*) క్రీజులో ఉన్నారు. బుమ్రా, జడేజా చెరో వికెట్ తీశారు.