News October 22, 2024
ఎన్ఐసీకి ధరణి బాధ్యతలు

TG: ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC)కి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల వరకు పర్యవేక్షించిన గ్రూప్ క్వాంటెలాను ప్రభుత్వం పక్కన పెట్టింది. తక్కువ వ్యయంతో నిర్వహణకు ముందుకు రావడంతో ఎన్ఐసీకి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. NIC మూడేళ్ల పాటు నిర్వహణ చూడనుంది.
Similar News
News November 15, 2025
తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్

తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తుండగా అంతరాయం కలిగింది. ఈ సమయంలోనే న్యాయస్థానం వెబ్సైట్లో బెట్టింగ్ సైట్ ప్రత్యక్షం కావడంతో సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై హైకోర్టు రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు హ్యాకర్ల గురించి దర్యాప్తు చేపట్టారు.
News November 15, 2025
రూ.1,201 కోట్ల పెట్టుబడి.. రేమండ్ ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన

AP: సీఐఐ వేదికగా రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. రూ.1,201 కోట్ల మూడు ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు రేమండ్ సంస్థ ప్రకటించింది. ఈమేరకు వాటికి సీఎం చంద్రబాబు, సంస్థ ఎండీ గౌతమ్ మైనీ శంకుస్థాపన చేశారు. దేశ ఏరోస్పేస్, రక్షణ అవసరాలను తీర్చేలా రేమండ్ పరికరాలు తయారుచేయడం అభినందనీయమని CBN అన్నారు.
News November 15, 2025
యాపిల్‌కు త్వరలో కొత్త CEO.. టిమ్ కుక్ వారసుడు ఎవరు?

2011లో స్టీవ్ జాబ్స్ నుంచి టిమ్ కుక్ యాపిల్ CEOగా బాధ్యతలు అందుకున్నారు. కంపెనీని 4 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లిన కుక్.. 2026 ప్రారంభంలో తన వారసుడిని ప్రకటిస్తారనే ప్రచారం సాగుతోంది. 2001లో హార్డ్‌వేర్ ఆర్కిటెక్ట్‌గా ప్రొడక్ట్ డిజైన్ టీమ్‌లో చేరిన జాన్ టెర్నస్ తదుపరి సీఈవోగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని టాక్. ఈ మేరకు సన్నాహాలు జరుగుతున్నట్టు ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్టులో పేర్కొంది.


