News July 16, 2024
ఆ ముగ్గురికీ రెస్ట్.. గంభీర్ విముఖత?

శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ఈరోజు ప్రకటించే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, కోహ్లీ, బుమ్రా, పాండ్యకు రెస్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే పాండ్య మినహా మిగిలిన సీనియర్లకు రెస్ట్ ఇచ్చేందుకు కొత్త కోచ్ గంభీర్ విముఖత చూపినట్లు తెలుస్తోంది. లంకతో వన్డేల అనంతరం చాలా విశ్రాంతి ఉంటుందని గంభీర్ అన్నారట. కాగా ఆగస్టు 2-7 మధ్య ఈ 3 వన్డేల సిరీస్ జరగనుంది.
Similar News
News March 25, 2026
టీడీపీ ఎమ్మెల్యే కుమార్తె పెళ్లి.. హాజరైన ఏపీ, టీజీ సీఎంలు

AP: టీడీపీ సీనియర్ నేత, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కుమార్తె వైదీప్తి వివాహానికి ఇరు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. గుంటూరులో జరిగిన ఈ వేడుకకు ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వేర్వేరుగా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఏపీ ఐటీ మంత్రి లోకేశ్‌తో రేవంత్ ముచ్చటించారు.

యుద్ధం పేరుతో ధరలు పెంచేశారు: జగన్

AP: రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం పేరుతో నిత్యావసరాల ధరలు పెంచేసిందని జగన్ ఆరోపించారు. ‘వంట నూనెలు కేజీకి ₹40, పప్పుల ధరలు కేజీకి ₹15+ పెంచేశారు. సిలిండర్లను బ్లాక్‌లో ₹2000-3000కు అమ్ముతున్నారు. ఇప్పుడు కిరోసిన్ ఇస్తామంటున్నారు’ అని విమర్శించారు. ‘మా హయాంలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ పెడతామంటే ఆహ్వానించి భూములు చూపించాం. ఇప్పుడు CBN క్రెడిట్ చోరీ చేస్తున్నారు’ అని అద్దంకి నేతలతో భేటీలో పేర్కొన్నారు.