News March 21, 2024
48 గంటల్లో ‘సెట్‌టాప్’ సేవల పునరుద్ధరణ: APSFL

AP: రాష్ట్రంలోని అన్ని సెట్‌టాప్ బాక్సుల సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు APSFL వెల్లడించింది. ఎన్నికల కోడ్‌కు అనుగుణంగా డేటాను మార్చుతున్నామని, 48 గంటల్లో సేవలను పునరుద్ధరిస్తామని తెలిపింది. ప్రభుత్వ ప్రకటనలు, అభివృద్ధి కార్యక్రమాల సమాచారం సెట్‌టాప్‌లలో ప్రసారం కావడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Similar News
News December 21, 2025
సూపర్ ఫామ్‌లో కాన్వే.. మరో సెంచరీ

వెస్టిండీస్‌తో మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ NZ ఓపెనర్ కాన్వే సెంచరీ చేశారు. 136 బంతుల్లో (8 ఫోర్లు, 3 సిక్సులు) సెంచరీ మార్క్ అందుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆయన <<18609470>>డబుల్ సెంచరీ<<>> సాధించారు. దీంతో ఒకే టెస్టులో డబుల్ సెంచరీ, సెంచరీ సాధించిన తొలి కివీస్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించారు. కాగా ఈ మాజీ CSK ప్లేయర్ ఇటీవల జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిన సంగతి తెలిసిందే.
News December 21, 2025
రాష్ట్రంలో 182 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

APలోని 26 జిల్లాల్లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, జువైనల్ జస్టిస్ బోర్డులో 182 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఉద్యోగాన్ని బట్టి డిగ్రీ, చైల్డ్ సైకాలజీ, సైకియాట్రీ, సోషియాలజీ, హెల్త్ సైన్స్, ఎడ్యుకేషన్, LLB ఉత్తీర్ణతతో పాటు సంక్షేమ కార్యక్రమాల్లో పని చేస్తున్నవారు అప్లై చేసుకోవచ్చు. వయసు 35-65ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్సైట్: wdcw.ap.gov.in/ *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News December 21, 2025
NLCIL 575పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్(<


