News October 28, 2024
హైదరాబాద్లో నెల రోజులపాటు ఆంక్షలు

TG: హైదరాబాద్లో నవంబర్ 28 వరకు నెల రోజులపాటు ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు. పలు సంస్థలు, పార్టీలు శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందని సమాచారం రావడంతో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామన్నారు. సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలపై నిషేధం ఉంటుందని, ఒకే చోట ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడకూడదని తెలిపారు.
Similar News
News November 23, 2025
మహిళలు.. మీకు సలాం

క్రికెట్ అంటే జెంటిల్మెన్ గేమ్ అన్న మాటలను భారత మహిళలు బద్దలు కొడుతున్నారు. కొన్ని రోజుల క్రితం హర్మన్ సేన ICC వన్డే వరల్డ్ కప్ గెలుచుకోగా, తాజాగా అంధుల మహిళల జట్టు తొలి టీ20 <<18367663>>WC<<>>ను నెగ్గింది. దీంతో ఆ జట్టుకు SMలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. చూపు లేకపోయినా తమ ఆటతో మరికొందరికి భవిష్యత్తుకు దారి చూపించారని పలువురు పోస్టులు చేస్తున్నారు. టాలెంట్ను ప్రోత్సహిస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయని అంటున్నారు.
News November 23, 2025
RBIలో మెడికల్ కన్సల్టెంట్ ఉద్యోగాలు

<
News November 23, 2025
వన్డేలకు కొత్త కెప్టెన్ను ప్రకటించిన టీమ్ ఇండియా

దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్కు భారత జట్టుకు కొత్త కెప్టెన్ను BCCI ప్రకటించింది. మూడు వన్డేల సిరీస్కు రాహుల్ సారథిగా వ్యవహరించనున్నట్లు వెల్లడించింది. బుమ్రా, సిరాజ్కు రెస్ట్ ఇవ్వగా గిల్, అయ్యర్ గాయాలతో దూరమయ్యారు.
జట్టు: రోహిత్, జైస్వాల్, కోహ్లీ, తిలక్ వర్మ, రాహుల్(C), పంత్(VC), సుందర్, జడేజా, కుల్దీప్, నితీశ్ కుమార్, హర్షిత్ రాణా, రుతురాజ్, ప్రసిద్ధ్, అర్షదీప్, ధ్రువ్ జురెల్.


