News September 21, 2025

H1B వీసాలపై ఆంక్షలు.. ట్విస్ట్ ఏంటంటే?

image

కొత్తగా H1B వీసాకు దరఖాస్తు చేసుకునే వారికే <<17767574>>ఫీజు<<>> పెంపు వర్తిస్తుందని వైట్ హౌజ్ అధికారులు చెప్పారని NDTV పేర్కొంది. ప్రస్తుతం ఉన్నవారికి లేదా రెన్యూవల్ చేసుకునే వారిపై ఎలాంటి ప్రభావం ఉండబోదని వెల్లడించారని తెలిపింది. కాగా మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి కంపెనీలు H1B, H-4 వీసాలు ఉన్న తమ ఉద్యోగులను 14 రోజుల పాటు దేశం విడిచి వెళ్లవద్దని, ఇప్పటికే బయట ఉంటే వెంటనే వెనక్కి రావాలని ఆదేశించాయి.

Similar News

News September 21, 2025

అమెరికా ఒక్కటే లేదు బ్రదర్..!

image

కొత్తగా H1B వీసాపై అమెరికా వెళ్లేవారికి లక్ష డాలర్ల ఫీజు పెంపు వర్తించనుంది. అయితే పూర్తిగా అమెరికాపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్ తదితర దేశాల్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల కొరత ఉందని, ఆ దేశాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవాలని చెబుతున్నారు. ఎప్పటికప్పుడు స్కిల్స్ పెంచుకుంటూ ఉండాలని, Aiపై ఎక్కువ ఫోకస్ చేయాలని అంటున్నారు.

News September 21, 2025

ఎంగిలి పూల బతుకమ్మ.. ఏ నైవేద్యం పెట్టాలంటే?

image

బతుకమ్మ పండుగ మొదటి రోజును ‘ఎంగిలి పూల బతుకమ్మ’ అని పిలుస్తారు. ఈ రోజున నైవేద్యంగా నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి ప్రత్యేకమైన ప్రసాదం తయారు చేస్తారు. ఈ ప్రసాదాన్ని గౌరీ దేవికి సమర్పిస్తారు. ఇది పితృపక్షం మహాలయ అమావాస్య రోజున వస్తుంది. కాబట్టి పూర్వీకులకు తర్పణాలు వదిలి, ఆ తర్వాత ఈ పూజ చేస్తారు. బతుకమ్మ ఆటపాటలు పూర్తయ్యాక, ఈ ప్రసాదాన్ని అందరూ పంచుకుంటారు.

News September 21, 2025

నేడు పాక్‌తో టీమ్ఇండియా సూపర్‌-4 పోరు

image

ఆసియాకప్ 2025లో టీమ్ ఇండియా, పాకిస్థాన్ రెండో సారి తలపడనున్నాయి. గ్రూప్ దశలో అజేయంగా సాగిన సూర్య సేన అదే జోరును సూపర్-4లోనూ కంటిన్యూ చేయాలని చూస్తోంది. భారత స్పిన్ విభాగం పటిష్ఠంగా ఉండగా బ్యాటింగ్‌లో సూర్య, సంజూ, అభిషేక్ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. అటు పాక్‌ను తక్కువ అంచనా వేయలేం. దుబాయ్ వేదికగా మ్యాచ్ నేడు రా.8 గంటలకు ప్రారంభమవుతుంది. సోనీ స్పోర్ట్స్ ఛానల్, సోనీ లివ్ యాప్‌లో లైవ్ చూడవచ్చు.