News December 13, 2024

హైదరాబాద్‌లో న్యూ‌ఇయర్ వేడుకలపై ఆంక్షలు

image

TG: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేళ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అర్ధరాత్రి 1గంట వరకే ఈవెంట్స్ నిర్వహించాలని, సీసీ కెమెరాలు తప్పనిసరి అని నిర్వహకులకు సూచించారు. 15 రోజుల ముందే కచ్చితంగా అనుమతి తీసుకోవాలన్నారు. వేడుకల్లో అశ్లీల నృత్యాలపై నిషేధం విధించారు. తాగి వాహనం నడిపితే రూ.10వేల ఫైన్, 6 నెలలు జైలుశిక్ష విధిస్తామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు.

Similar News

News November 18, 2025

పిస్తా హౌస్, షా గౌస్, Mehfil హోటళ్లలో ఐటీ సోదాలు

image

TG: హైదరాబాద్‌లోని ప్రముఖ హోటళ్లైన పిస్తా హౌస్, షా గౌస్, Mehfil ఛైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో ఆదాయపు పన్ను అధికారులు సోదాలు చేపట్టారు. మొత్తం 50 టీమ్స్‌తో 15 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. ఈ రెండు హోటళ్లు ఏటా రూ.వందల కోట్ల వ్యాపారం చేస్తున్నాయి. HYD, దుబాయ్‌తో పాటు ఇతర నగరాల్లోనూ బ్రాంచులు ఉన్నాయి.

POK ప్రధానిగా రజా ఫైసల్

image

పాక్ ఆక్రమిత కశ్మీర్ నూతన ప్రధానిగా PPP నేత రజా ఫైసల్ ముంతాజ్ ఎన్నికయ్యారు. ఇమ్రాన్ ఖాన్ PTI పార్టీకి చెందిన అన్వరుల్ హక్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి ఆమోదం లభించడంతో కొత్త ప్రధాని కోసం ఓటింగ్ నిర్వహించారు. 52 సభ్యులకు గాను ముంతాజ్‌కు 32 మంది అనుకూలంగా ఓటేశారు. కాగా POKకు స్వయంప్రతిపత్తిని కల్పించినట్లు చెప్పుకునే పాక్ అక్కడ నామమాత్రపు PM, ప్రెసిడెంట్ పదవులను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.