News October 30, 2024

RESULTS: ఫార్మా డీ ఫలితాలు విడుదల

image

అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయం పరిధిలోని ఫార్మా డీ 2, 3, 4 సంవత్సరాల రెగ్యులర్, సప్లిమెంటరీ (R14, R17) పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివ కుమార్ తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం https://jntuaresults.ac.in/ వెబ్ సైట్‌ను సందర్శించాలని సూచించారు.

Similar News

News November 5, 2024

పోలీసుల గౌరవం పెంచడానికి ప్రభుత్వం కృషి: హోం మంత్రి

image

రాష్ట్రంలో పోలీసుల గౌరవాన్ని పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో డీఎస్పీల పాసింగ్ అవుట్ కార్యక్రమానికి హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ.. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణకు కృషి చేస్తున్నామన్నారు. పోలీసు వ్యవస్థపై గురుతర బాధ్యత ఉన్నదని, అందరూ సమర్థవంతంగా పని చేయాలని కోరారు.

News November 5, 2024

నీటి వినియోగదారుల సంఘం ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జిల్లాలో త్వరలో నీటి వినియోగదారుల సంఘం ఎన్నికలు నిర్వహించనున్నామని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. నీటి వినియోగదారుల సంఘం ఎన్నికలలో ఇరిగేషన్ అధికారులు ప్రతి ఉత్సాహం చూపకూడదని కలెక్టర్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా జల వనరుల శాఖ ఆధ్వర్యంలో సాగునీటి సంఘం ఎన్నికల మొదటి విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

News November 5, 2024

కూటమి నాయకులతో ఇన్‌ఛార్జి మంత్రి సమీక్ష

image

కడప జిల్లాలోని ఎన్డీఏ కూటమి నాయకులతో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సవిత సమీక్ష నిర్వహించారు. మంగళవారం కడపలోని రహదారులు భవనాల శాఖ అతిథి గృహం నందు ఎన్డీఏ కూటమి నాయకులతో నిర్వహించిన సమావేశంలో జిల్లాలోని ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్చార్జులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. భవిష్యత్తులో కూటమినేతలు కలిసికట్టుగా చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు.