News May 1, 2024

RESULTS.. టెన్త్ విద్యార్థులకు అలర్ట్

image

TG: టెన్త్ విద్యార్థులు ఇవాళ్టి నుంచి మే 15 వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫీజులు చెల్లించవచ్చు. రీకౌంటింగ్‌కు ₹500, రీవెరిఫికేషన్‌కు సబ్జెక్టుకు ₹1000 చెల్లించాలి. దరఖాస్తులో HMతో సంతకం చేయించి, హాల్‌టికెట్ జతపరిచి DEO ఆఫీసులో ఇవ్వాలి. రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసిన వారు రీకౌంటింగ్ కోసం అప్లై చేయకూడదు. అటు జూన్ 3 నుంచి జరిగే సప్లిమెంటరీ పరీక్షలకు ఎలాంటి ఫైన్ లేకుండా మే 16 వరకు ఫీజు కట్టొచ్చు.

Similar News

News March 27, 2026

పెళ్లిపై స్పందించిన సాయి పల్లవి

image

తన పెళ్లిపై వస్తున్న రూమర్లకు హీరోయిన్ సాయి పల్లవి ఫుల్ స్టాప్ పెట్టారు. ఓ ప్రోగ్రామ్‌లో జర్నలిస్టులు పెళ్లి గురించి అడగ్గా ఆమె స్పందించారు. ‘ప్రస్తుతం నా పూర్తి దృష్టి కెరీర్‌పైనే ఉంది. పెళ్లి గురించి ఇప్పట్లో ఎలాంటి ఆలోచన లేదు. నేను ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నా’ అని చెప్పారు. కాగా ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘ఏక్ దిన్’ అనే సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నారు.

News March 27, 2026

అలా అయితే ధోనీ IPL ఆడొద్దు: అశ్విన్

image

IPL-2026లో CSK లెజెండ్ ధోనీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడొద్దని మాజీ క్రికెటర్ అశ్విన్ అన్నారు. ‘ధోనీ ప్లేయింగ్-11లోనే ఉండాలి. 3 నెలల నుంచి ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆడగలననే నమ్మకం ఉంది కాబట్టే అలా చేశారు. ఒకవేళ తుది జట్టులో లేకపోతే టోర్నీ మొత్తానికే ఆడకూడదు. ఫీల్డ్‌లో ఉంటే కెప్టెన్ రుతురాజ్‌కు సపోర్ట్ ఇస్తారు. ఒకవేళ ధోనీకి ఆడాలని లేకపోతే రిటైర్ అవుతారు’ అని అభిప్రాయపడ్డారు.

News March 27, 2026

పెళ్లయిన వ్యక్తి మరొకరితో సహజీవనం నేరం కాదు: అలహాబాద్ హైకోర్టు

image

పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం నేరం కాదని అలహాబాద్ హైకోర్టు ఇటీవల వ్యాఖ్యానించింది. నైతికత, చట్టం వేర్వేరు అని పేర్కొంది. చట్టం ప్రకారం నేరం రుజువు కానప్పుడు పౌరుల హక్కులను పరిరక్షించడంలో న్యాయస్థానం తీసుకునే చర్యలను సామాజిక అభిప్రాయాలు, నైతికత నిర్దేశించలేవంది. లివ్-ఇన్ రిలేషన్‌లో ఉన్న జంట రక్షణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ కామెంట్లు చేసింది.