News April 30, 2024
RESULTS.. 6 స్కూళ్లలో అందరూ ఫెయిల్

TG: ఇవాళ విడుదలైన టెన్త్ ఫలితాల్లో 6 స్కూళ్లలో జీరో పాస్ పర్సంటేజ్ నమోదైందని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ఇందులో 4 ప్రైవేట్ స్కూళ్లు, 2 ఎయిడెడ్ స్కూళ్లు ఉన్నాయని.. ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా ఇందులో లేదని వెల్లడించారు. ఇక 3927 స్కూళ్లలో 100శాతం ఉత్తీర్ణత నమోదైందని.. ఇందులో 1347 ZP స్కూళ్లు ఉన్నాయన్నారు. ఇక 8,883 మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించారని పేర్కొన్నారు.
Similar News
News March 15, 2026
అభిషేక్, నేను అగ్ని లాంటోళ్లం: సంజు శాంసన్

అభిషేక్ శర్మ, తాను ఐస్-ఫైర్‌లా ఉండమని, తాము కలిస్తే అగ్నికి అగ్ని తోడైనట్లేనని సంజూ శాంసన్ అన్నారు. ‘ఓపెనింగ్‌లో కొన్నిసార్లు నేను, ఇంకొన్నిసార్లు అభిషేక్ దూకుడుగా ఆడాం. 2024 నుంచి ఇదే చేస్తున్నాం’ అని ఇండియా టుడే కాంక్లేవ్‌లో చెప్పారు. ఇంతకుముందు అభిషేక్ ఫాలోయింగ్‌ను చూసి అసూయపడేవాళ్లమని పేర్కొన్నారు. జట్టులో అతడో సూపర్ స్టార్ అని, త్వరగా పెళ్లి చేసుకోవాలని జోక్ చేశారు.
News March 15, 2026
తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్!

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు మరిన్ని సౌకర్యాలను TTD అందుబాటులోకి తీసుకొస్తోంది. వసతి గృహాల్లో దిండు, దుప్పటి, చాప, బెడ్‌షీట్‌లను ఇవ్వనుంది. తొలుత నందకంలో ఇవ్వడం ప్రారంభించగా భక్తుల నుంచి సానుకూల స్పందన వచ్చింది. దీంతో వకుళామాత, పాంచజన్యం, కౌస్తుభం తదితర గెస్ట్‌హౌసుల్లోనూ అందజేయాలని నిర్ణయించింది. దుప్పటి-₹10, 2 దిండ్లు-₹10, చాప-₹10, బెడ్‌షీట్-₹20 చొప్పున చెల్లించి తీసుకోవచ్చు.