News February 8, 2025
వెలువడుతున్న ఫలితాలు.. బీజేపీ 4, ఆప్ 1
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు లీడింగ్‌లో కొనసాగిన BJP, AAP విజయాలు నమోదు చేస్తున్నాయి. BJP 4 చోట్ల విజయం సాధించగా AAP ఒకచోట గెలుపొందింది. మరో 42స్థానాల్లో కమలదళం, 23చోట్ల ‘చీపురు’ పార్టీ లీడింగ్‌లో కొనసాగుతున్నాయి. వాస్తవానికి ఆప్ 26 సీట్లలో ఆధిక్యంలో ఉండగా కేజ్రీవాల్, ఆతిశీ, సిసోడియా వెనుక పడిపోవడంతో ఆధిక్యం 23కు తగ్గింది. అగ్రనేతలే ఆ పార్టీకి భారం కావడం గమనార్హం.
Similar News
News February 8, 2025
మళ్లీ పెరిగిన బంగారం ధరలు
బంగారం ధరలు ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.150 పెరిగి రూ.79,450లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.160 పెరగడంతో రూ.86,670 పలుకుతోంది. కాగా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ రేటు రూ.1,07,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
News February 8, 2025
ఢిల్లీ ఫలితాలపై పవన్ ఏమన్నారంటే?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ప్రధాని మోదీపై ప్రజలకు ఉన్న విశ్వాసం మరోసారి రుజువైందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేలా మోదీ పాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు. మోదీ నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకోవడంలో ఢిల్లీ పాత్ర అత్యంత కీలకమన్నారు. అమిత్ షా రాజకీయ అనుభవం, చాతుర్యం సత్ఫలితాలు ఇచ్చాయని పేర్కొన్నారు.
News February 8, 2025
0..0..0: ఢిల్లీలో కాంగ్రెస్ హ్యాట్రిక్ డకౌట్
దేశ రాజధాని ఢిల్లీ ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కనీసం 40% ఓటుషేర్ సంపాదించేది. మాజీ CM షీలాదీక్షిత్ నాయకత్వంలో వరుసగా హ్యాట్రిక్ విజయాలు అందుకున్న పార్టీ. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. వరుసగా మూడో సారీ ఖాతా తెరవకుండా హ్యాట్రిక్ డకౌట్ రికార్డు ఖాతాలో వేసుకుంది. క్రితంసారి 3% ఓటుషేర్ సాధించిన హస్తం పార్టీ ఈసారి 7 శాతంతో ఆనందపడాల్సి వస్తోంది. ఆ పార్టీ దుస్థితిపై మీ కామెంట్.