News April 13, 2024

రిజల్ట్స్ వచ్చేశాయ్..

image

దేశంలోని ప్రముఖ యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించిన సీయూఈటీ-పీజీ(CUET PG 2024) ఫలితాలు విడుదలయ్యాయి. నిన్న తుది కీ విడుదల చేసిన NTA.. ఇవాళ ఫలితాలను ప్రకటించింది. గత నెల 11 నుంచి 28వ తేదీ వరకు దేశంలోని ప్రధాన నగరాల్లో CUET-PG 2024 పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

Similar News

News October 11, 2024

టెన్త్ అర్హతతో 39,481 ఉద్యోగాలు.. మరో 3 రోజులే ఛాన్స్!

image

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులకు దరఖాస్తు గడువు సమీపిస్తోంది. 39,481 పోస్టులకు అక్టోబర్ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 18-23 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హత: టెన్త్ పాస్ అయి ఉండాలి. పురుషులకు 35,612, మహిళలకు 3869 పోస్టులు ఉన్నాయి. BSF, CISF, CRPF, SSB, ITBP, SSF, ARలో ఉద్యోగాలు భర్తీ చేస్తారు. దరఖాస్తు చేసుకోవాల్సిన <>సైట్<<>>: https://ssc.gov.in/

News October 11, 2024

ఈవీఎంలపై చంద్రబాబు కప్పదాటు మాటలు: మేరుగు

image

AP: ఈవీఎంలపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్‌పై ఉందని మాజీ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. గతంలో EVMలపై చంద్రబాబే ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు మేం ప్రశ్నిస్తుంటే చంద్రబాబు మాపై కోప్పడుతున్నారని మండిపడ్డారు. కేంద్రంలో ఉన్నప్పుడు ఒకమాట, లేనప్పుడు మరోమాట మాట్లాడుతున్నారన్నారని, సంపన్న దేశాలు సైతం బ్యాలెట్ వైపు మొగ్గు చూపుతున్న విషయాన్ని గమనించాలన్నారు.

News October 11, 2024

సచిన్ రికార్డును రూట్ బద్దలుగొడతారు.. కానీ..: వాన్

image

టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన సచిన్‌కు ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ కేవలం 3వేల పరుగుల దూరంలోనే ఉన్నారు. ఆ రికార్డును అందుకునే సత్తా రూట్‌కి ఉందని ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైకేల్ వాన్ అన్నారు. ‘రూట్ కచ్చితంగా ఆ రికార్డును సాధిస్తారు. అయితే దాని కోసం అతడు సుదీర్ఘకాలం ఆడాలి. క్రికెట్ అంటే అతనికి ప్రాణం. కచ్చితంగా అలా ఆడతారనే అనుకుంటున్నా. రూట్ ఇప్పటికే ఓ దిగ్గజం’ అని కొనియాడారు.