News June 1, 2024
ఎగ్జిట్ పోల్స్కు మించి ఫలితాలు: సజ్జల

AP: ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తమకే అధికారం వస్తుందని వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ‘జూన్ 4న దీనికి మించి ఫలితాలు వస్తాయి. మహిళలు వైసీపీకి అండగా నిలిచారు. చాలా సైలెంట్గా వైసీపీకి ప్రజలు ఓట్లు వేశారు. అన్ని పార్టీలు ఏకమైనా వాళ్లు గెలవడం లేదు. ఎందుకు అధికారంలోకి రాలేకపోతున్నారో వాళ్లు ఆలోచించుకోవాలి’ అని హితవు పలికారు.
Similar News
News October 16, 2025
జగన్ సొంత ఫోన్ నంబర్ ఇవ్వలేదు: సీబీఐ

AP: విదేశీ పర్యటనకు వెళ్లిన YCP చీఫ్ జగన్ తన సొంత ఫోన్ నంబర్ కాకుండా మరొకరిది ఇచ్చారని సీబీఐ అధికారులు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఆయన పర్యటన అనుమతిని రద్దు చేయాలని కోరారు. విదేశాలకు వెళ్లే ముందు తన ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ సహా పర్యటన వివరాలు ఇవ్వాలనే షరతులను జగన్ ఉల్లంఘించారని HYD సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని జగన్ తరఫు న్యాయవాదిని కోర్టు ఆదేశించింది.
News October 16, 2025
మేడారం పనులు R&Bకి బదిలీ

TG: మేడారం టెండర్లపై మంత్రుల మధ్య <<18018400>>వివాదం<<>> వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ పనులను ప్రభుత్వం దేవాదాయ శాఖ నుంచి R&B శాఖకు బదిలీ చేసింది. దేవాదాయ శాఖకు పనులను పర్యవేక్షించే సాంకేతికత లేదని, పనుల స్వభావం, నాణ్యత, నిర్ణీత సమయంలో పూర్తి చేయడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. రికార్డులను R&Bకి అప్పగించాలని ఆదేశించింది. కొండా సురేఖ ఎండోమెంట్ మంత్రిగా ఉన్నారు.
News October 16, 2025
నేడు ఈశాన్య రుతుపవనాల ఆగమనం

ఇవాళ దక్షిణ భారతదేశంలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు IMD పేర్కొంది. ఇదే రోజు నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమిస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో నేడు APలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు APSDMA పేర్కొంది. ఈ నెల 20కల్లా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని IMD అంచనా వేసింది. అది వాయుగుండం లేదా తుఫానుగా మారే ప్రమాదముందని హెచ్చరించింది.