News April 30, 2024
రిజల్ట్స్ c/o వే2న్యూస్

పబ్లిక్ పరీక్షల ఫలితాల విషయంలో Way2News మరోసారి నం.1గా నిలిచింది. AP ఇంటర్, TG ఇంటర్ తర్వాత ఇవాళ విడుదలైన TG SSC ఫలితాలనూ ఎక్కువ మంది వే2న్యూస్ ద్వారా తెలుసుకున్నారు. 5 లక్షల మందికి పైగా విద్యార్థులు TG SSC పరీక్షలు రాస్తే ఇవాళ ఏకంగా 96% మంది మన ప్లాట్‌ఫాం ద్వారా రిజల్ట్స్ పొందారు. మిగతా సైట్లు, ప్లాట్‌ఫాంలతో పోలిస్తే వేగంగా, సులువుగా, సేఫ్‌గా రిజల్ట్స్ ఇస్తామనే మీ నమ్మకం వల్లే ఇది సాధ్యమైంది.
Similar News
News January 20, 2026
MSVPG హిట్.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

MSVPG హిట్ కావడంతో ప్రేక్షకులను ఉద్దేశించి చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘మూవీపై ప్రేక్షక దేవుళ్లు చూపిస్తున్న ఆదరణతో నా మనసు కృతజ్ఞత భావనతో నిండిపోతోంది. మీరు లేనిదే నేను లేను. ఈ విజయం తెలుగు ప్రేక్షకులది. స్క్రీన్‌పై నన్ను చూడగానే మీరు వేసే విజిల్స్, చప్పట్లే నన్ను నడిపించే శక్తి. రికార్డులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మీరు నాపై చూపించే ప్రేమ శాశ్వతం. మూవీ టీంకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.
News January 20, 2026
పెళ్లికి ముందు రక్తపరీక్షలు ఎందుకంటే?

ఆరోగ్యకరమైన వైవాహిక జీవితం కోసం, పుట్టబోయే పిల్లల భవిష్యత్తు కోసం పెళ్లికి ముందే జంటలు కొన్ని రక్త పరీక్షలు చేయించుకోవాలంటున్నారు నిపుణులు. తలసేమియా, సికిల్ సెల్ అనీమియా, హెచ్‌ఐవీ, హెపటైటిస్ B, C, సిఫిలిస్ వంటి ఇన్ఫెక్షన్లు, Rh ఫ్యాక్టర్‌ను గుర్తించడానికి రక్త పరీక్షలు కీలకం. భవిష్యత్తును ఆరోగ్యకరంగా, సంతోషంగా ప్లాన్ చేసుకోవడానికి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ముఖ్యమని ప్రతిఒక్కరూ గుర్తించాలి.
News January 20, 2026
తొలి EV ‘అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా’ ఆవిష్కరించిన టయోటా

భారత్‌లో టయోటా తన మొదటి EV ‘అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా’ కారును ఆవిష్కరించింది. LED డీఆర్‌ఎల్స్, ఆకర్షణీయమైన హెడ్ లాంప్స్, డిఫరెంట్ ఫ్రంట్ బంపర్ అమర్చారు. ఇంటీరియర్‌లో సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్, పవర్డ్ డ్రైవర్ సీట్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్స్ ఉన్నాయి. 61kWh బ్యాటరీ వేరియంట్ 543KM, 49kWh వేరియంట్ 440KM మైలేజీ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ కారు ధరను ఇప్పటి వరకు ప్రకటించలేదు.


